Allari Naresh's 65th Movie Grand Launch With Pooja Ceremony: ఎప్పుడూ డిఫరెంట్, యునీక్ కాన్సెప్ట్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తుంటారు అల్లరి నరేష్. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సాధించి దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన తనదైన కామెడీ టైమింగ్, యాక్షన్, మాస్, ఎమోషన్ ఇలా ఆడియన్స్ మదిలో స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆయన మరో కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు.
'Naresh65'... డిఫరెంట్ టైటిల్
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నరేష్ కొత్త చిత్రం 'Naresh65' శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తుండగా... చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్ గా ఉండబోతోంది. 'కామెడీ గోస్ కాస్మిక్' అని మేకర్స్ చెప్పడం క్యురియాసిటీని పెంచింది. ఈ సినిమాకు 'రంభ ఊర్వశి మేనక' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రమోహన్ ఇంతకు ముందు స్టార్ డైరెక్టర్ల దగ్గర పని చేశారు. దిల్, హరీష్ శంకర్ కలిసి నిర్మించిన 'ATM' వెబ్ సిరీస్‌ను ఈయనే రూపొందించారు. శర్వానంద్‌తో 'రాధ' అనే మూవీ చేశారు. ఇప్పుడు డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్‌తో అల్లరి నరేష్ హీరోగా మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
Also Read: 'పుష్ప 3: ది ర్యాంపేజ్' కన్ఫర్మ్ చేసిన సుకుమార్ - ఎప్పుడో తెలుసా?
క్లాప్ కొట్టిన నాగ చైతన్య
ఈ చిత్రం పూజా కార్యక్రమానికి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మూవీ టీం, పరిశ్రమ నుంచి ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు నాగ చైతన్య క్లాప్ కొట్టగా... స్టార్ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. హర్ష్ శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సరికొత్త రోల్‌లో
మెయిన్‌స్ట్రీమ్ కామెడీ, డిఫరెంట్ ఆఫ్‌బీట్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ '#Naresh65'తో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిసున్నారు. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం టెక్నికల్‌గా గ్రాండ్‌గా రూపొందనుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా... మిగిలిన వివరాలు మూవీ టీం త్వరలోనే వెల్లడించనుంది.
గత కొంతకాలంగా అల్లరి నరేష్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఆయన లాస్ట్‌గా నటించిన 'బచ్చలమల్లి' అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇక లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఆల్కహాల్'తో రాబోతున్నారు. మెహర్ తేజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.