Director Sukumar Confirms Pushpa 3 The Rampage Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన మూవీ అంటే వెంటనే గుర్తొచ్చేది 'పుష్ప'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రాంఛైజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధిస్తే దానికి సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప: ది రూల్' వరల్డ్ వైడ్‌‌గా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ మూడో పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


సుక్కూ కన్ఫర్మేషన్


'పుష్ప' మూడో పార్ట్ కచ్చితంగా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు డైరెక్టర్ సుకుమార్. ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న 'పుష్ప 2: ది రూల్' దుబాయ్ వేదికగా జరుగుతున్న 'SIIMA 2025' అవార్డుల్లోనూ సత్తా చాటింది. అత్యధిక విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న మూవీ 5 అవార్డులు కైవసం చేసుకుంది. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ డైరెక్టర్‌గా సుకుమార్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ బాబు అవార్డులు గెలుచుకున్నారు.


ఈ సందర్భంగా అవార్డు అందుకున్న డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప 3'పై యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... 'పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది. ఇది రెండో పార్ట్ క్లైమాక్స్‌లోనే కన్ఫర్మ్ చేశాం.' అంటూ స్పష్టం చేశారు. గతంలో 'పుష్ప 3: ది ర్యాంపేజ్' అంటూ పోస్టర్స్ రిలీజ్ కావడం వరకూ తప్ప ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. 


Also Read: బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - రూ.500తో భాగ్యనగరానికి వచ్చిన ఓ యువకుడి స్టోరీ


ర్యాంపేజ్ ఎలా ఉంటుంది?


నిజానికి 'పుష్ప 2' రిలీజ్‌‌కు ముందు ట్రైలర్ అంటూ రిలీజ్ చేసిన వీడియోలో మూవీకి సంబంధించిన సీన్స్ ఏవీ లేకపోవడంతో అది 'పుష్ప 3' ట్రైలర్ అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగింది. 'పుష్ప 2' క్లైమాక్స్‌లో పుష్పరాజ్ తన కుటుంబంతో కలిసి తన అన్న కూతురి పెళ్లి వేడుకలో పాల్గొంటూ తన అన్నయ్య అందరూ కలిసి సంతోషంగా ఉండడంతో ముగుస్తుంది. ఇదే సమయంలో ఓ బాంబ్ బ్లాస్ట్ కావడం చూపిస్తారు. ఆ బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగింది? పుష్పకు ఎవరైనా వెన్నుపోటు పొడిచారా? లేదా అతని శత్రువులే అటాక్ చేశారా? అనే సస్పెన్స్‌తోనే 'పుష్ప 3: ది ర్యాంపేజ్' అంటూ ఎలివేషన్ ఇస్తూ ఎడ్ కార్డ్ వేశారు. ఈ క్రమంలో పార్ట్ 3 కోసం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


గతంలో చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ 'పుష్ప 3'పై అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్‌తో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా... అది పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని నిర్మాత నవీన్ తెలిపారు. దీని ప్రకారం 'పుష్ప 3' 2028లో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక బన్నీ ప్రస్తుతం అట్లీతో ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆ మూవీ పూర్తైన తర్వాత మిగిలిన ప్రాజెక్టులపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.