విజనరీ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో వస్తున్న భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). జనవరిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఇప్పటి నుంచే ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ మూవీ టికెట్లు యూఎస్ఏలో హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి.
యూఎస్‌ఏలో ఊహించని రెస్పాన్స్
రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మెగా బడ్జెట్ మూవీలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సముద్రఖని, సునీల్ తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ 2025 జనవరి 10న పాన్ ఇండియా వైడ్ గా తెలుగు తో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓవర్సీస్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ఇప్పటిదాకా అమ్ముడైన ప్రీమియర్ టికెట్స్ సంఖ్య ద్వారా తెలిసిపోతుంది.
Also Read: బరోజ్ రివ్యూ: మోహన్ లాల్ దర్శకుడిగా మారిన సినిమా - ఎలా ఉందంటే?
యూఎస్ లో 'గేమ్ ఛేంజర్' ప్రీ సేల్స్ సంచలనం మొదలైంది. కేవలం ప్రీమియర్ షోలకే 10,000 టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ప్రీ సేల్స్ అంటే అక్కడ ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో రికార్డును క్రియేట్ చేస్తున్. కానీ ఇలా ప్రీమియర్ షోలకే ఈ రేంజ్ లో టికెట్లు అమ్ముడు కావడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి చూస్తుంటే 'గేమ్ ఛేంజర్' యూఎస్ లో ప్రీ సేల్స్ పరంగా రికార్డును బ్రేక్ చేయడం ఖాయం అన్పిస్తోంది. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు.
యూఎస్‌ఏలో భారీ ఈవెంట్ ఎఫెక్ట్
నిజానికి యూఎస్ లో ఈ రేంజ్ లో సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరగడానికి కారణం, రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' మేకర్స్ అక్కడ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్. అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఈ వేడుకను రాజేష్ కల్లేపల్లి అత్యంత భారీగా నిర్వహించగా, అందరిలోనూ ఎగ్జైట్మెంట్ పెంచేసింది. ఇక ఈ రేంజ్ లో యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా కోసం నిర్వహించలేదు. అలాగే అమెరికా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కడ మంచి రెస్పాన్స్ కూడా దక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్లకు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరి ప్రీమియర్లకే ఇలా ఉంటే, సినిమా రిలీజ్ అయ్యాక ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా తెలుగు స్టేట్స్ లో 3 భారీ ఈవెంట్స్ తో ప్రమోషన్స్ అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు 'గేమ్ ఛేంజర్' టీం.
Read Also: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?