Fahadh Faasil Next Movie: ఫహాద్ ఫాజిల్... ఇప్పుడు ఆయన కేవలం మలయాళ సినిమా ఇండస్ట్రీలో హీరో మాత్రమే కాదు.‌ పాన్ ఇండియా స్టార్. ఇంతకు ముందు మలయాళంలో ఫహాద్ నటించిన సినిమాలు ఇతర భాషల్లో డబ్బింగ్ అయితే ఆడియన్స్ చూసేవారు. 'పుష్ప: ది రైజ్', 'పుష్ప: ది రూల్' సినిమాల తర్వాత ఆయన మరింత పాపులర్ అయ్యారు. హిందీలోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఆయనతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. 


'జబ్ వుయ్ మెట్', 'రాక్ స్టార్' దర్శకుడితో ఫహాద్ సినిమా
Imtiaz Ali confirms The Idiot of Istanbul movie with Fahadh Faasil: బాలీవుడ్ దర్శకులలో ఇంతియాజ్ అలీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'రాక్ స్టార్', 'తమాషా' సినిమాలను ఆయనే చేశారు. 'జబ్ వుయ్ మెట్' సినిమా కూడా ఆయన తీసినదే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' సినిమా ఉంది కదా. హిందీలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన 'లవ్ ఆజ్ కల్' సినిమాకు అది రీమేక్. ఆ మూవీ డైరెక్టర్ కూడా ఇంతియాజ్ అలీ. ఫహద్ ఫజిల్ హీరోగా ఒక సినిమా చేయనున్నట్లు తాజా ఇంటర్వ్యూలో ఆయన కన్ఫర్మ్ చేశారు.


Also Readబరోజ్ రివ్యూ: మోహన్ లాల్ దర్శకుడిగా మారిన సినిమా - ఎలా ఉందంటే?


ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించనున్న సినిమాకు 'ది ఇడియట్ ఆఫ్ ఇస్తాంబుల్' టైటిల్ ఖరారు చేశారు. ఆ విషయాన్ని కూడా దర్శకుడు చెప్పారు. 'ది ఇడియట్ ఆఫ్ ఇస్తాంబుల్' సినిమా గురించి ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ... ''నేను చాలా రోజులగా ఈ సినిమా తీయాలని అనుకుంటున్నాను. ఫహాద్ ఫాజిల్ హీరోగా సినిమా చేయాలని నా ప్లాన్'' అని చెప్పారు. కొత్త‌ సంవత్సరంలో... 2025లో సినిమా మొదలు కావచ్చు.


Also Readబేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?