Gama Awards 2021, 2022, 2023 winners list: దుబాయ్‌లోని జబిల్ పార్కులో ఈ నెల 3వ తేదీన ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సమర్పించు 'గామా' 4వ ఎడిషన్ తెలుగు మూవీ అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరిగింది. గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు ఘనంగా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. 43 విభాగాల్లో అవార్డులు ఇచ్చారు. హీరోయిన్లు డింపుల్ హయతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్, నేహా శెట్టి, ఫరియా అబ్దుల్లా అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఈ వేడుకలో  హీరో మంచు మనోజ్, ఉత్తమ నటులుగా ఎంపికైన నిఖిల్ సిద్ధార్థ, సందీప్ కిషన్, తేజ సజ్జ, ఆనంద్ దేవరకొండ సందడి చేశారు. 


''ఇక్కడికి విచ్చేసిన వేలాదిమంది తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు హాయ్! ఈ దుబాయ్ వేదికగా మీ మధ్య ప్రతిష్టాత్మక గామా వేడుక నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేం ఈ అవార్డులు ప్రారంభించినప్పటి నుంచి సహాయ, సహకారాలు అందిస్తూ... ఈ వేడుకలు ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి థాంక్స్" అని గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ అన్నారు.


ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సమర్పించు గామా పురస్కార గ్రహీతలు ఎవరో చూడండి



  • ఉత్తమ నటుడు (2021) - అల్లు అర్జున్ (పుష్ప)

  • ఉత్తమ నటుడు (2022) - నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)

  • ఉత్తమ నటుడు (2023) - ఆనంద్ దేవరకొండ (బేబీ)

  • ఉత్తమ నటి (2021) - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)

  • ఉత్తమ నటి (2022) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం)

  • ఉత్తమ నటి (2023) - సంయుక్తా మీనన్ (విరూపాక్ష)

  • బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (2021) - దక్షా నాగర్కర్ (జాంబి రెడ్డి)

  • బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (2022) - డింపుల్ హయతి (ఖిలాడి)

  • బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (2023) - ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)

  • బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హనుమాన్)

  • మూవీ ఆఫ్ ది ఇయర్ (2021) - పుష్ప (మైత్రి మూవీ మేకర్స్ - యలమంచిలి రవి, నవీన్ యెర్నేని)

  • మూవీ ఆఫ్ ది ఇయర్ (2022) - సీతా రామం (వైజయంతి మూవీస్ - స్వప్న, ప్రియాంక దత్)

  • మూవీ ఆఫ్ ది ఇయర్ (2023) - బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - టీజీ విశ్వప్రసాద్)


Also Read: బాలీవుడ్ దర్శకుడితో ఓటీటీ కోసం తమన్నా సినిమా?



  • ఉత్తమ దర్శకుడు (2021) - సుకుమార్  (పుష్ప)

  • ఉత్తమ దర్శకుడు (2022) - హను రాఘవపూడి (సీతా రామం)

  • ఉత్తమ దర్శకుడు (2023) - బాబీ కొల్లి (వాల్తేరు వీరయ్య)

  • గామా జ్యూరీ ఉత్తమ నటుడు (2022) - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)

  • గామా జ్యూరీ ఉత్తమ నటుడు (2023) - సందీప్ కిషన్ (మైఖేల్)

  • గామా లెజెండ్రీ సంగీత దర్శకుడు - డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

  • గామా స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

  • గామా గౌరవ్ సత్కర్ - చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)

  • ఉత్తమ సంగీత దర్శకుడు (2021) - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)

  • ఉత్తమ సంగీత దర్శకుడు (2022) - ఎస్ఎస్ తమన్ (భీమ్లా నాయక్)

  • ఉత్తమ సంగీత దర్శకుడు (2023) - హేషమ్ అబ్దుల్ వహాబ్ (ఖుషి)

  • బెస్ట్ ఆల్బమ్ (2022) - సీతా రామం (విశాల్ చంద్రశేఖర్)

  • ఉత్తమ గేయ రచయిత (2023) - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి... దసరా సినిమాలో పాట)

  • ఉత్తమ విలక్షణ నటుడు - మురళీ శర్మ

  • అత్యంత ప్రజాదరణ పొందిన పాట (2021) - నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)

  • అత్యంత ప్రజాదరణ పొందిన పాట (2023) - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)

  • గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ఆర్ఆర్ (డీవీవీ దానయ్య నిర్మాణం)

  • గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నక్కిలీసు గొలుసు (రఘు కుంచె)


Also Readప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ



  • ఉత్తమ గాయకుడు (2021) - ధనుంజయ్ (నా మది నీదే)

  • ఉత్తమ గాయకుడు (2022) - అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల... శ్యామ్ సింగరాయ్)

  • ఉత్తమ గాయకుడు (2023) - రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా)

  • ఉత్తమ గాయని (2021) - ఎంఎల్ శృతి (అడిగా అడిగా)

  • ఉత్తమ గాయని (2022) - హారిక నారాయణ (లాహే లాహే... ఆచార్య)

  • ఉత్తమ గాయని (2023) - చిన్మయి (ఆరాధ్య - ఖుషి)

  • గామా బెస్ట్ పాపులర్ సాంగ్ 2021 - మౌనిక యాదవ్ (సామి  నా సామి - పుష్ప)

  • గామా గద్దర్ మెమోరియల్ అవార్డు - జానపద గాయకుడు 'నల్లగొండ గద్దర్' నరసన్న


Also Readఅమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ