యంగ్ హీరో శర్వానంద్ తండ్రయ్యాడు. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. తనకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని ప్రకటించాడు. అంతేకాదు.. తన పాప పేరును కూడా ప్రకటించాడు. అయితే, బిడ్డ ఎప్పుడు పుట్టిందనే వివరాలేవీ శర్వా చెప్పలేదు. తన బిడ్డకు లీలా దేవి మైనేని అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు. 


శర్వా 2023, జూన్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది పసునూరు మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే శర్వా.. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. బుధవారం శర్వా పుట్టిన రోజు. దీంతో తనకు ఆడ బిడ్డ పుట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 














శర్వా పుట్టిన రోజు సందర్భంగా.. యూవీ క్రియేషన్స్ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ పతాకంపై #Sharwa36 మూవీని ప్రకటించారు.   వంశీ, ప్రమోద్ నిర్మించనున్నఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే అభిలాష్ తెరకెక్కించిన జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో శర్వా బైకర్‌గా కనిపించనున్నాడు. శర్వా యూవీ క్రియేషన్స్‌లో నటించిన సినిమాలన్నీ హిట్ కొట్టాయి. ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ సినిమాలు శర్వా కేరీర్‌ను మలుపుతిప్పాయి. ఈ నేపథ్యంలో #Sharwa36 కూడా శర్వాకు మరోసారి బ్రేక్ ఇవ్వనుందని అభిమానులు సంబరపడుతున్నారు.





మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా శర్వాతో మూవీని ప్రకటించింది. ఈ మూవీకి ‘మనమే’ టైటిల్ ఖరారు చేసింది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య గతంలో ‘భలే మంచి రోజు’, ‘శమంతక మణి’, ‘దేవదాస్’, ‘హీరో’ సినిమాలకు దర్శకత్వం వహించారు. శర్వా సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. ఇందులో శార్వాతోపాటు ఓ చిన్నారి కూడా పక్కన నిలబడి కనిపిస్తుంది.





అలాగే ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో #Sharwa37 మూవీ పోస్టర్‌ను కూడా బుధవారం రిలీజ్ చేశారు.






 Also Read: ‘శతమానం భవతి’ సీక్వెల్.. శర్వా ప్లేస్ లో ఆ క్రేజీ హీరో!