Tamannaah Bhatia to headline Neeraj Pandey's film? Find out: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రయోగాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకప్పుడు ఆమెను కేవలం కమర్షియల్ సినిమాల కథానాయికగా మాత్రమే చూసేవారు. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ... ఆ తర్వాత తమన్నా రూట్ మార్చారు. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఓటీటీ అని చిన్న చూపు చూడకుండా వెబ్ సిరీస్, ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరొక ఓటీటీ సినిమా స్టార్ట్ చేశారని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండేతో ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నారట.


ఫిబ్రవరిలో ఓటీటీ సినిమా స్టార్ట్ చేసిన తమన్నా!
తమన్నా ఇటీవల 'ఓదెల 2' సినిమా స్టార్ట్ చేశారు. ప్రముఖ తెలుగు దర్శకుడు సంపత్ నంది అందించిన కథతో రూపొందుతోంది. ఆ సినిమా కంటే ముందు నీరజ్ పాండే దర్శకత్వంలో మరో సినిమా చిత్రీకరణ ప్రారంభించారని బీ టౌన్ వర్గాల ద్వారా తెలిసింది. అందులో ఆమె లీడ్ రోల్ చేస్తున్నారు. అదొక ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని టాక్. 


ఓ ప్రముఖ ఓటీటీ వేదిక కోసం తమన్నా, నీరజ్ పాండే ఆ సినిమా చేస్తున్నారట. అయితే... అధికారికంగా వివరాలు ఏమీ వెల్లడించలేదు. కానీ, ఫిబ్రవరి 24న సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. ఎందుకు అంత సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారో మరి!? ఈ ఏడాది ఆ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.


Also Readప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ


Tamannaah Bhatia Upcoming Movies OTT Projects: సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తమన్నా... ఓటీటీలో డిఫరెంట్ వెబ్ సిరీస్, ఫిలిమ్స్ చేస్తూ తన అభిరుచి చాటుకుంటున్నారు. తమన్నాలో కొత్త నటిని వీక్షకులకు పరిచయం చేస్తున్నారు. తెలుగులో 'ఎలెవెన్త్ అవర్', తమిళంలో 'నవంబర్ స్టోరీ' వెబ్ సిరీస్‌లు చేశారు. హిందీలో గత ఏడాది 'జీ కర్దా', 'ఆఖరి సచ్' చేశారు. ఇక... విజయ్ వర్మతో కలిసి చేసిన 'లస్ట్ స్టోరీస్ 2' యాంథాలజీలో స్టోరీ ఆమెకు మంచి పేరు తెచ్చింది. 'బబ్లీ బౌన్సర్' సినిమా కూడా చేశారు తమన్నా. మరి, ఓటీటీ కోసం చేస్తున్న ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో?


'ఓదెల 2'లో నాగ సాధువుగా తమన్నా?
వారణాసిలో 'ఓదెల 2' పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కాశీలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. చిత్రీకరణ చేస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిలో తమన్నా నాగ సాధువుగా కనిపించారు.  


హిందీలో మరో రెండు సినిమాలు చేస్తున్న తమన్నా
'ఓదెల 2', నీరజ్ పాండే సినిమా కాకుండా తమన్నా చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో 'అరణ్మణై 4', హిందీలో జాన్ అబ్రహం జోడీగా 'వేద' సినిమా చేస్తున్నారు.


Also Readఅమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ