KS Ravikumar: ఎవరు నవ్వినా తట్టుకోలేరు, నా అసిస్టెంట్‌ను కొట్టడానికి వచ్చారు: బాలకృష్ణ‌పై దర్శకుడు షాకింగ్ కామెంట్స్

KS Ravikumar about Balakrishna: బాలకృష్ణ ఆఫ్ స్క్రీన్ ప్రవర్తన గురించి ప్రేక్షకులు తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఒక దర్శకుడు కూడా షూటింగ్ సెట్‌లో ఆయన ప్రవర్తన గురించి బయటపెట్టారు.

Continues below advertisement

Director KS Ravikumar About Balakrishna: టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలు అందరిలో బాలకృష్ణ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఫ్యాన్స్ తనను కలవడానికి వచ్చినప్పుడు బాలయ్య ఎలా ప్రవర్తిస్తారో ఇప్పటివరకు వైరల్ అయిన ఎన్నో వీడియోలలో చూశాం. చాలావరకు వీడియోల్లో ఫ్యాన్స్‌ను బాలయ్య కొట్టడం గురించి కూడా చాలామందికి తెలుసు. ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. షూటింగ్ సెట్‌లో కూడా ఎవరి ప్రవర్తన అయినా ఆయనకు నచ్చకపోతే అలాగే ప్రవర్తిస్తారని కూడా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

అసిస్టెంట్‌ను కొట్టడానికి వచ్చారు..

హన్సిక హీరోయిన్‌గా నటించిన ‘గార్డియన్’ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో కేఎస్ రవికుమార్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో అందరూ సీరియస్‌గా ఉండాలని బాలయ్య అనుకుంటారని, ఎవరు నవ్వినా తట్టుకోలేరని చెప్పుకొచ్చారు రవికుమార్. అదే విషయంపై ఒకసారి తన అసిస్టెంట్‌ను కూడా కొట్టడానికి వచ్చారని గుర్తుచేసుకున్నారు. మామూలుగా షూటింగ్ సెట్‌లో బాలయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకుంటారు.. ఇప్పుడు కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు వారు మాట్లాడుకునేదాన్ని నిజం చేస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.

పిలిచి మరీ కొడతారు..

షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్టు కనిపిస్తే బాలయ్య తట్టుకోలేరని చెప్పుకొచ్చారు రవికుమార్. తనను చూసే నవ్వుకుంటున్నారని అనుకుంటారని తెలిపారు. దానివల్ల ఆయనకు కోపం వస్తుందని, ఎవరు నవ్వుతున్నారో వారిని పిలిచి కొడతారని కూడా అన్నారు. బాలకృష్ణ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో తన అసిస్టెంట్ శరవణన్‌ను ఫ్యాన్ తిప్పమని చెప్పగా.. అతడు అనుకోకుండా బాలయ్య వైపు తిప్పాడని, దీంతో ఆయన విగ్ చెదిరిపోయిందని గుర్తుచేసుకున్నారు. అది చూసి శరవణన్ నవ్వాడని, అది చూసి ఎందుకు నవ్వుతున్నావంటూ బాలయ్య గట్టిగా అరిచారని బయటపెట్టారు కేఎస్ రవికుమార్.

అప్పుడే కుదుటపడ్డారు..

బాలయ్య అరవడం చూసి శరవణన్‌ను కొడతాడేమో అని భయపడిన రవికుమార్.. వెళ్లి అతడు తన అసిస్టెంటే అని చెప్పి కూల్ చేశారని చెప్పారు. అయినా సరే ఆయన కూల్ అవ్వలేదని అన్నారు. దానికోసం ఆయన కూడా శరవణన్‌పై అరిచారని గుర్తుచేసుకున్నారు. దాంతో బాలయ్య కాస్త కుదుటపడ్డారని తెలిపారు. ఇక ‘గార్డియన్’ ప్రెస్ మీట్‌లో ఈ విషయం మొత్తాన్ని వివరించారు రవికుమార్. ఆయన ఇదంతా చెప్తున్నంత సేపు హీరోయిన్ హన్సిక నవ్వుతూనే ఉన్నారు. కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో ‘రూలర్’, ‘జై సింహా’ వంటి రెండు తెలుగు చిత్రాలు వచ్చాయి. కానీ ఆ రెండు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో వీరు మళ్లీ కలిసి పనిచేయలేదు.

Also Read: బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో ఆలియా భట్ - కన్ఫర్మ్ చేసిన ఆ నిర్మాణ సంస్థ సీఈఓ

Continues below advertisement