జాన్వీ కపూర్ (Janhvi Kapoor)... ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులకు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె. ఉత్తరాది ప్రేక్షకులకు నయా అతిలోక సుందరి. హిందీ చిత్రాలతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆమె పలకరించనున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం క్యూట్ పోస్టర్ విడుదల చేసింది.


Thangam... హ్యాపీ బర్త్ డే!
పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న 'దేవర' జాన్వీ కపూర్ (Janhvi Kapoor First Telugu Movie)కు తెలుగులో ఫస్ట్ స్ట్రయిట్ ఫిల్మ్. తంగం పాత్రలో ఆమె యాక్ట్ చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రోజు 'దేవర' నుంచి జాన్వీ కపూర్ కొత్త లుక్ విడుదల చేశారు. సాంప్రదాయ చీరలో ఆమె రూపం, ఆ నవ్వు మరింత క్యూట్ క్యూట్‌గా ఉందని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు (Janhvi Kapoor Second Look In Devara Movie).


Also Readప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ






దసరాకు థియేటర్లలో 'దేవర'
రెండు భాగాలుగా 'దేవర' థియేటర్లలోకి రానుంది. తొలి భాగం 'దేవర: పార్ట్ 1'ను తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే, ఆ ప్లాన్ మారింది. 10.10.2024... అక్టోబర్ 10న దసరా సందర్భంగా 'దేవర' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.


Also Read: శర్వా కొత్త సినిమా టైటిల్ ఇదే - ఫస్ట్ లుక్‌లో చిన్నారి ఎవరంటే?


'జనతా గ్యారేజ్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు.


ఎన్టీఆర్ 'దేవర' తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశాన్ని జాన్వీ కపూర్ అందుకున్నారు. సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్న సినిమాలో కథానాయికగా ఆమె నటించనున్నట్లు ఇవాళ వెల్లడించారు.