Sharwanand New Movie titled Maname: ప్రామిసింగ్ యంగ్ స్టార్ శర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేస్తోంది. 'భలే మంచి రోజు'తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత 'శమంతక మణి', 'దేవదాస్', 'హీరో' సినిమాలు తీసిన టాలెంటెడ్ యంగ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'మనమే' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు టీజర్ కూడా విడుదల చేశారు.  


'మనమే' ఫస్ట్ లుక్ టీజర్ చూశారా?
ఆ విరిగిన కాలితో హీరోని చూశారా?
Maname Telugu movie first look teaser Review: లండన్ నేపథ్యంలో 'మనమే' సినిమా రూపొందుతోంది. ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా మరోసారి ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే... హీరోతో పాటు ఓ చిన్నారి కూడా కనిపిస్తారు. ఆ అబ్బాయి పేరు విక్రమ్ ఆదిత్య. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు అని తెలిసింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. 


'మనమే' ఫస్ట్ లుక్ టీజర్ చివర్లో విరిగిన కాలితో హీరో శర్వానంద్ (Sharwanand with broken leg) కనిపించారు. 'ఇట్స్ టైమ్ ఫర్ సమ్ షాంపైన్' అని చెప్పారు. ఆ తర్వాత హీరోయిన్ కృతి శెట్టిని చూపించారు. ఈ సినిమాలో చిన్నారి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్ అవుతాయని సమాచారం. ఈ చిత్రానికి తొలుత BOB ('బేబీ ఆన్ బోర్డ్') టైటిల్ పరిశీలించారట. ఆ తర్వాత ఆ టైటిల్ పక్కనపెట్టి 'మనమే' వైపు మొగ్గు చూపారు.


Also Read: రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ ఎవరో అఫీషియల్‌గా చెప్పేశారోచ్






పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ హిట్ 'హృదయం'తో తెలుగు ప్రేక్షకులు కొందరిని ఆయన ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'... నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు.


Also Readప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ






ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్ & ఫణి కె వర్మ, కళా దర్శకుడు: జానీ షేక్, కూర్పు: ప్రవీణ్ పూడి, మాటలు: అర్జున్ కార్తీక్ - ఠాగూర్ - వెంకీ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ - జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.