Janhvi Kapoor birthday announcement: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకు తెర పడింది. రామ్ చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు ఈ రోజు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.


రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్
Janhvi Kapoor to join Ram Charan in Buchi Babu Sana's Movie: నేడు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తమ సినిమాలో ఆమెను స్వాగతిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సైతం చెప్పారు. త్వరలో తన కుమార్తె రామ్ చరణ్ సినిమా కూడా చేస్తుందని ఆయన హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ప్రస్తుతం తెలుగులో 'దేవర' చేస్తున్నారు జాన్వీ కపూర్. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్నారు. ఇప్పుడీ రామ్ చరణ్ సినిమా ఆమెకు తెలుగు హీరోతో రెండో పాన్ ఇండియా ఫిల్మ్ అవుతుంది.


Also Read: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ






హీరోగా రామ్ చరణ్ 16వ చిత్రమిది. అందుకని, RC16 Movieగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27న సినిమాలో ఆయన లుక్ విడుదల చేయనున్నారు.


రెహమాన్ సంగీతంలో రామ్ చరణ్ సినిమా!
ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా ''హ్యాపీ బర్త్ డే ఇసై పుయల్. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారిని మా సినిమాలోకి స్వాగతిస్తున్నాం'' అని చిత్ర బృందం పేర్కొన్నారు.


Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో జయసుధ కుమారుడు






సరికొత్త మేకోవర్... సర్‌ప్రైజ్ చేసే లుక్!
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్ల ముందు వరుసలో ఉంటుంది. దాని కోసం ఆయన మేకోవర్ కూడా ఉన్నారు. చిట్టిబాబు కంటే 'RC16' సినిమాలో తనది  బెస్ట్ క్యారెక్టర్ అని గతంలో ఒకసారి రామ్ చరణ్ చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆ రోల్ కోసం ఆయన స్పెషల్ మేకోవర్ అవుతున్నారట. ఈ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు.