Kalki 2898 AD No Update on Maha Shivaratri: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ 'కల్కీ 2898 ఏడీ' మూవీపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి తరచూ ఎదోక అప్‌డేట్‌ హాట్‌టాపిక్‌ అవుతుంద. మొన్నటి వరకు రిలీజ్‌ డేట్‌ వాయిదా అంటూ ఓ రూమర్‌ చక్కర్లు కొట్టింది. మే 9న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం నుంచే ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అయినా కల్కీ వాయిదా పడుతుందంటూ ప్రచారం చేశారు. ఈ వార్త ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ని డైలామాలో పడేసింది.


దాంతో స్వయంగా మూవీ టీం స్పందించి విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దాంతో మూవీ లవర్స్‌ అంతా రిలాక్స్‌ అయ్యారు. ఇదిలా ఉంటే కల్కీ టీంకు సంబంధించి అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులు అయ్యింది. దీంతో ఈ మహా శివరాత్రికి మూవీ టీం ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తుందా? అని ఆడియన్స్‌, ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. ఈ శివరాత్రికి 'కల్కీ 2898 ఏడీ' నుంచి ఏదైనా స్పెషల్‌ వీడియో వచ్చే చాన్స్‌ ఉందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతుంది. 


అందుకే శివరాత్రికి నో సర్‌ప్రైజ్‌!


ఇంకేముంది ఫ్యాన్స్‌ అంతా శివరాత్రికి వచ్చే అప్‌డేట్‌ కోసం ఈగర్‌గా వేయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వారందరిని నిరాశపరిచే మరో అప్‌డేట్‌ వార్తల్లో నిలిచింది. ఈ శివరాత్రి కోసం మూవీ టీం ఎలాంటి స్పెషల్‌ ప్లాన్‌ చేయలేదట. ఈసారి ఎలాంటి వాయిదా లేకుండా సినిమాను చెప్పిన డేట్‌కే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ పట్టుదలతో ఉన్నారు. దాంతో కల్కీ సినిమా షూటింగ్‌ తొందరగా పూర్తి చేసే పనిలో లీనమైంది నాగ్‌ అశ్విన్‌ అండ్‌ టీం. ప్రస్తుతం క్రూషియల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతుందట. దాంతో కొద్ది రోజులు నాగ్‌ అశ్విన్‌ అండ్‌ టీం మూవీ షూటింగ్‌తో ఫుల్‌ బిజీ బిజీగా ఉన్నారట. అలాంటి సమయంలో శివరాత్రి కోసం స్పెషల్‌ వీడియో రెడీ చేసే టైం లేదని, అందుకే ఈ స్పెషల్‌ డేకు ఎలాంటి అప్‌డేట్‌ వచ్చే అవకాశం లేదంటున్నారు. మూవీ రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచే గ్లింప్ప్‌, టీజర్‌, ట్రైలర్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు.


అప్పటి వరకు ఎలాంటి స్పెషల్‌ వీడియోస్‌ సాధ్యం కాదని మూవీ టీం చెప్పినట్టుగా ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఈ తాజాగా అప్‌డేట్‌ చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ డిసప్పాయింట్‌ అవుతున్నారు. ఈసారి నిరాశ పరిచిన నెక్ట్స్‌ ఇచ్చే అప్‌డేట్‌తో విజువల్‌ వండర్‌ చూపించి అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తామని కల్కీ టీం మాత్రం చాలా కాన్పీడెంట్‌గా చెబుతుందట. కాగా నాగ్‌ అశ్విన్‌ కల్కీని పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా టైం ట్రావెలర్‌ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు భారీ తారాగణం, హై టెక్నికల్‌ టీం వర్క్‌ చేస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వరల్డ్‌ వైడ్‌ 22 భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నారు. దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ అయితే లేదు కానీ, ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక భాషల్లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ ఫిల్మ్ గా 'కల్కి2898AD' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందనడం సందేహం లేదు. మరి మూవీ టీం త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.