Premalu Telugu Song: మలయాళీ సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై, పెద్ద హిట్ అందుకున్న మూవీ ‘ప్రేమలు’. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి అద్భుత ఆదరణ దక్కింది. కేవలం రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా  ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఫిబ్రవరి 9న ఈ మూవీ విడుదల కాగా, ఇప్పటికే, ఇప్పటికీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ఈ నెల 8న తెలుగులో విడుదల కాబోతోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మలయాళీ ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా, త్వరలో తెలుగు ఆడియెన్స్ నూ థియేటర్లలో ఆకట్టుకోబోతోంది.


ఆకట్టుకుంటున్న ‘ప్రేమలు’ తెలుగు సాంగ్


తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్‌ అండ్ కామెడీతోగా ట్రైలర్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ చక్కటి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘వెల్ కం టు హైదరాబాద్’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. కేరళ నుంచి హైదరాబాద్ కు వచ్చిన హీరో, హీరోయిన్లు ఇక్కడి వాతావరణానికి ఎలా అలవాటు పడ్డారు అనే విషయాన్ని ఇందులో చూపించారు. హైదరాబాద్ అందాలను ఈ పాటలో చక్కగా చూపించారు.



తెలుగు వెర్షన్ కు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‍ కలిసి వచ్చేనా?


ఇక ‘ప్రేమలు’ సినిమాలో  నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. నెల్సన్, మమితా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‍ లో కొనసాగుతుంది. తెలుగు వెర్షన్ మూవీకి ఈ పాయింట్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ కూడా కంప్లీట్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‍ స్టార్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా రైట్స్ కోసం డిస్నీ+ హాట్‍ స్టార్ భారీ మొత్తం వెచ్చించినట్టు తెలుస్తోంది.  


‘ప్రేమలు‘ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లతో కలిసి ఫహాద్ ఫాసిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు. మలయాళీ దుమ్మురేపిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Read Also: ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చేయను, కంగనా అంత మాట అనేసిందేంటి?