Vijay Deverakonda's Family Star movie usa premiere shows talk: వెయిట్ ఈజ్ ఓవర్, 'ది' విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఫ్యామిలీ స్టార్' థియేటర్లలోకి వచ్చింది. ఏపీ, తెలంగాణ కంటే అమెరికా, యూకేలో ముందుగా ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ఎన్నారై ఆడియన్స్ ఏం అంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? నెటిజన్స్ ఏం కామెంట్స్ చేస్తున్నారు? అనేది ఒక్కసారి చూడండి.
సెకండాఫ్ బెటర్... ఓవరాల్ రేటింగ్ 4/5
'ఫ్యామిలీ స్టార్' ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేయవచ్చట. అందులో స్ట్రాంగ్ కమర్షియల్ వైబ్స్ ఉన్నాయని చెప్పాడు. అయితే, సెకండాఫ్ ఫస్టాఫ్ కంటే బావుందట. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పికప్ అయ్యాయని, ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాయని చెప్పాడు. హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మన్స్ ఇంప్రెస్సివ్ అంటూ సినిమాకు 4/5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.
ఇది ఫ్యామిలీ బొమ్మ... డౌట్ లేకుండా బ్రేక్ ఈవెన్
''ఇది ఫ్యామిలీ బొమ్మ, మాస్ & కమర్షియల్ మైండ్ సెట్ తో థియేటర్లకు వెళ్లకుండా ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లండి. ఎంజాయ్ చేయండి. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మన్స్ బావుంది. డౌట్ లేకుండా బ్రేక్ ఈవెన్ అవుతుంది'' అని సుజీవ్ నాని అనే నెటిజన్ ట్వీట్ చేశాడు.
Also Read: మళ్లీ దొరికిన రష్మిక, విజయ్ దేవరకొండ - బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు!
విజయ్ దేవరకొండ కొత్తగా ఉన్నాడు
''నాకు అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ బాగా నచ్చింది'' అని పృథ్వీ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యవద్దని, జస్ట్ ఎంటర్టైన్ అవ్వమని సలహా ఇచ్చాడు. ఇంకా ''విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ కొత్తగా ఉంది. ఏం క్రీమ్స్ వాడుతున్నాడో గానీ స్కిన్ సూపర్ ఉంది. యాజ్ యూజువల్ గా మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రజెన్స్, పెర్ఫార్మన్స్ ఐ ఫీస్ట్. డైరెక్టర్ పరశురామ్ పెట్ల వర్క్ గుడ్'' అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
Also Read: విజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్
పాజిటివ్ రివ్యూలే కాదు, మిక్స్డ్ టాక్ కూడా...
'ఫ్యామిలీ స్టార్' సినిమాకు పాజిటివ్ రివ్యూలే కాదు, మిక్స్డ్ & నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. కొంత మంది సీరియల్ టైపు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రతి మూవీ రిలీజ్ కాకుండా సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు రావడం కామన్. 'ఖుషి'తో కంపేర్ చేస్తే ఈ మూవీకి నెగెటివ్ ట్రెండ్ ఎక్కువ ఉందని చెప్పాలి.
'ఫ్యామిలీ స్టార్' రొటీన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అని వెంకీ రివ్యూస్ ట్వీట్ చేశాడు. ఇది టెంప్లేట్ మూవీ అన్నాడు. టైంపాస్ మూమెంట్స్ ఉన్నా గానీ ఎమోషన్స్ కనెక్ట్ కాలేదన్నాడు. ఫస్టాఫ్ సీరియల్ టైప్ ఉందట. సెకండాఫ్ ఫన్ మూమెంట్స్ వర్కవుట్ అయ్యాయని చెప్పాడు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం కాంబినేషన్ డిజప్పాయింట్ చేసిందట. సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంకొన్ని ట్వీట్స్ చూడండి.