F3 Trailer: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా 'ఎఫ్ 3'. సమ్మర్ సోగాళ్ళు... అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. మే 27న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'ఎఫ్ 3' ట్రైలర్ చూస్తే... మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయ్యింది. 'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. ఆరో భూతం ఒకటి ఉంది. అదే డబ్బు' అని ఆయన డైలాగ్ చెప్పిన తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ స్క్రీన్ మీదకు వచ్చారు. ఆ తర్వాత హీరోయిన్లు మెహరీన్, తమన్నాలను చూపించారు. 'డబ్బు ఉన్నవాడికి ఫన్, లేనివాడికి ఫ్రస్ట్రేషన్' అని మురళీ శర్మ నోటి నుంచి మరో డైలాగ్. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్, నత్తితో ఇబ్బంది పడే యువకుడిగా వరుణ్ తేజ్ కనిపించారు. ఆలీ, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు తదితరులు నవ్వులు పూయించారు. డబ్బు చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. వేసవిలో సినిమా మాంచి ఫన్ అందించేలా ఉంది. (F3 Movie Trailer Out Now - Watch Here)
'ఎఫ్ 3' నుంచి ఆల్రెడీ రెండు సాంగ్స్ విడుదల చేశారు. 'లబ్ డబ్...', 'ఊ ఆ ఆహా ఆహా' సాంగ్స్ మంచి వ్యూస్ అందుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రమిది.
Also Read: విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేసిన సినిమాలు ఎన్ని? విజయాలు ఎన్ని?
వెంకటేష్ జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జంటగా మెహరీన్ నటించారు. సోనాల్ చౌహన్ ప్రత్యేక పాత్రలో, పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నటించారు. ఇందులో సునీల్, ప్రగతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.