Ed Sheeran : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇంటర్నేషనల్ వైడ్ గా మార్మోగిపోతోంది. తాజాగా పాపులర్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ తన కాన్సర్ట్ లో ఎన్టీఆర్ పాటను పాడిన వీడియో తెగ వైరల్ అవుతోంది.  


పాప్ సింగర్ నోట ఎన్టీఆర్ పాట


ప్రముఖ పాప్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం ఇండియా టూర్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన 6 నగరాల్లో కాన్సెప్ట్ లు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 30న పూణేతో తన పర్యటనను ప్రారంభించిన ఎడ్ షీరన్, ఫిబ్రవరి 2న హైదరాబాద్లోని ఐకానిక్ రామోజీ ఫిలిం సిటీలో కాన్సర్ట్ నిర్వహించారు. అలాగే ఫిబ్రవరి 5న చెన్నైలో, ఫిబ్రవరి 8న బెంగళూరులో ఈవెంట్ ను నిర్వహించారు. ఫిబ్రవరి 12న షిల్లాంగ్ లో ఆయన చివరి కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా జరిగిన కాన్సెప్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ నుంచి పాపులర్ సాంగ్ 'చుట్టమల్లె చుట్టేశావే' పాటను పాడుతూ సందడి చేశారు. 


ఎడ్ షరీన్ తో పాటు సింగర్ శిల్పారావు కలిసి స్టేజ్ పై 'చుట్టమల్లె' పాటను పాడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అక్కడున్న సంగీత ప్రియులు ఆయనకు కోరస్ ఇవ్వడం మరో హైలెట్. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర' బ్లాక్ బస్టర్ అన్న విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాట 'దేవర' మూవీ రిలీజ్ టైంలో ప్రేక్షకులను ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'నాటు నాటు' పాట తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరో ఆల్బమ్ గ్లోబల్ గా మ్యూజిక్ లవర్స్ ని ఊపేయడం నిజంగా టాలీవుడ్ కు గర్వకారణం. 






Also Readడైరెక్టుగా ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ... ETV Winలో హుషారు పోరి సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


గతంలోనూ ఎన్టీఆర్ ప్రస్తావన 
ఎడ్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. 2024 మార్చ్ లో తన కాన్సర్ట్ కోసం భారత్ కు వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీ గురించి ప్రస్తావించారు. ఆ సినిమాను చూసానని, అందులో 'నాటు నాటు' డ్యాన్స్ చాలా బాగుందని చెప్పడంతో 'ఆర్ఆర్ఆర్' టీమ్స్ సైతం స్పందించింది. అంతేకాదు ముంబైలో ఎడ్ షీరన్ బాలీవుడ్ సెలబ్రిటీల కోసం స్పెషల్ విందు ఏర్పాటు చేసి, అందులో షారుక్ తో కలిసి డాన్స్ చేశారు. అలాగే బాలీవుడ్ సింగర్ అంటే అర్మాన్ మాలిక్ తో కలిసి 'బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా' పాటకు ఎడ్ స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఎన్టీఆర్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్...
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ల పాపులారిటీ దేశాలు దాటడంతో, ప్రపంచం నలుమూలలా అభిమానులు ఏర్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ గా మార్మోగిపోతుంది. ఇప్పుడు ఎడ్ షీరన్ 'చుట్టమల్లె' సాంగ్ పాడుతున్న వీడియో వైరల్ అవుతుండగా, అంతకంటే ముందే అంతర్జాతీయ ఫుట్బాల్ సంస్థ ఫిఫా ఎన్టీఆర్ పేరుని వాడుతూ, ఫుట్బాల్ ఆటగాళ్లకు బర్త్ డే కి విష్ చేయడం, దానిపై ఎన్టీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేయడం తెలిసిందే. ఫిఫా వరల్డ్ కప్ తన సోషల్ మీడియా పేజీలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించింది ముగ్గురు ఫుట్బాల్ దిగ్గజాలు నెమార్, టెవేజ్, రోనాల్డో ఫోటోలు వచ్చేలా డిజైన్ చేసి, వారి పేర్లలో మొదటి అక్షరాలు కలిసి వచ్చేలా 'ఎన్టీఆర్' పేరును ప్రస్తావించింది. 




Also Readఇండియాలో కాస్ట్లీయస్ట్ విలన్... రెమ్యూనరేషన్‌లో 'కల్కి 2898 ఏడీ' కమల్, 'యానిమల్‌' బాబీని బీట్ చేసిన హీరోయిన్