Akkineni Nagarjuna Wishes To Naga Chaitanya For Thandel Success: నాగచైతన్య (Naga Chaitanya) 'తండేల్' సక్సెస్‌పై నటుడు నాగార్జున (Nagarjuna) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓ తండ్రిగా తన కుమారుడిని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. 'తండేల్' (Thandel) విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు. 'డియర్ చైతన్య.. నిన్న చూస్తుంటే ఓ తండ్రిగా గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశాను. 'తండేల్'.. సినిమా మాత్రమే కాదు నీ ఫ్యాషన్, కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానులు.. కుటుంబ సభ్యుల్లాగా ఎల్లప్పుడూ మా వెంటే ఉన్నారు. మీ ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు. సాయిపల్లవి కంగ్రాట్స్. దేవిశ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి, తండేల్ టీమ్‌కు, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసుకు బిగ్ థ్యాంక్స్' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైతూతో దిగిన ఫోటోతో పాటుగా తండేల్ పోస్టర్‌ను షేర్ చేశారు.

Also Read: అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేసిన చిరంజీవి.. హారర్ హిట్స్ ఇచ్చిన అమ్మాయికి పోలీస్ రోల్

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు

కాగా, నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' (Thandel) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించగా.. తొలి రెండు రోజులు ప్రపంచవ్యాప్తంగా తొలి 2 రోజులు రూ.41.2 కోట్ల గ్రాస్ అందుకుంది. తొలి రోజు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. రెండో రోజు సైతం రూ.20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. అటు, యూస్‌లోనూ 'తండేల్' వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే $550K మార్కును దాటింది. మొదటి వారంలో ఈ కలెక్షన్లు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అటు, 'బుక్ మై షో'లోనూ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉందని మూవీ టీం తెలిపింది.

చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' (Thandel) శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. తండేల్ రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Also Read: చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ... హీరోయిన్ సూసైడ్ అటెంప్ట్‌తో వార్తల్లోకి ప్రేమ కహానీ... హీరోగా హిట్స్ వచ్చినా ఇప్పుడు ఛాన్సుల్లేవ్