ఉస్తాద్ హీరో, యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart Movie). తనకు 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath)తో ఆ సినిమాకు చేస్తున్న సీక్వెల్ ఇది. ఇందులో రెండో సాంగ్ రిలీజుకు డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. 


జూలై 16న సాయంత్రం 4 గంటల నుంచి!
Watch Maar Muntha Chod Chinta Song Promo: 'డబుల్ ఇస్మార్ట్' నుంచి ఆల్రెడీ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. 'స్టెప్పా మార్...' అంటూ రామ్ వేసిన స్టెప్పులు, ఆ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రెండో సాంగ్ 'మార్ ముంత చోడ్ చింత'ను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.


'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ ప్రోమోను సోమవారం విడుదల చేశారు. అందులో హీరో రామ్ పోతినేనితో పాటు హీరోయిన్ కావ్య థాపర్ సైతం కనిపించారు. సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో జూలై 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు... అంటే రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు.






'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సూపర్ హిట్ సాంగ్స్, ఎక్సట్రాడినరీ రీ రికార్డింగ్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ 'డబుల్ ఇస్మార్ట్'కు సైతం సంగీతం అందిస్తున్నారు. ఈ 'మార్ ముంత చోడ్ చింత'కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా... రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ సీపాన, కీర్తనా శర్మ ఆలపించారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమో సూపర్ హిట్ అయ్యింది. మరి, సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.


Also Read: తేజుకు అనసూయ రిప్లై... సైలెంట్‌గా ఇచ్చి పడేసిన స్ట్రాంగ్ లేడీ



ఆగస్టు 15న 'డబుల్ ఇస్మార్ట్' గ్రాండ్ రిలీజ్!
Double Ismart Release Date: 'డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకం మీద పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు - ఖల్ నాయక్ సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.


Also Readకిరణ్ అబ్బవరం 2.0 - కాంతార రేంజ్‌లో 'క' టీజర్, ఆ విజువల్స్ చూశారా?



Double Ismart Movie Cast And Crew: రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా... సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో అలీ, 'గెటప్' శ్రీను, షాయాజీ షిండే, బనీ జె, మకరంద్ దేశ్ పాండే, 'టెంపర్' వంశీ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కెమెరా వర్క్: సామ్ కె నాయుడు - జియాని గియాన్నెలి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్, వీఎఫ్ఎక్స్: అనిల్ పాదూరి, ప్రొడక్షన్ డిజైనర్: జానీ షేక్, సీఈవో: విష్, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్, రచన - దర్శకత్వం: పూరి జగన్నాథ్.