Anant Ambani Wedding: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. తన చిన్న కుమారుడు అనంత్ పెళ్లి కోసం ముఖేశ్ అంబానీ ఖర్చు చేస్తున్న మొత్తాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ పెళ్లికి హాజరయిన గెస్ట్‌లకు మర్యాదల విషయంలో ఏ లోటు రాకుండా చూసుకుంది అంబానీ ఫ్యామిలీ. అంతే కాకుండా అనంత్ అంబానీ అయితే తన పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్‌కు కాస్ట్‌లీ గిఫ్టులు కూడా అందజేశాడు. ప్రస్తుతం అనంత్ అంబానీ ఇచ్చిన గిఫ్ట్, దాని ధర గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


కాస్ట్‌లీ గిఫ్ట్..


అనంత్ అంబానీ వద్ద కాస్ట్‌లీ వాచ్ కలెక్షన్ ఉంది. అలాంటి కలెక్షన్‌ను మెయింటేయిన్ చేయడం తనకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన వాచ్ ధరలు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అందుకే తన పెళ్లికి వచ్చిన తన ఫ్రెండ్స్‌కు కూడా తన ఫేవరెట్ బ్రాండ్ వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాడు అనంత్ అంబానీ. ఈ ఫ్రెండ్స్ లిస్ట్‌లో పలువురు బాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. వారంతా కలిసి అనంత్ తమకు ఇచ్చిన గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వాచ్ ధరలు తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఫ్రెండ్స్ పట్ల అనంత్ అంబానీ ప్రేమ చాలా కాస్ట్‌లీ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఒక్కొక్క వాచ్ ఎంతంటే?


తన పెళ్లికి వచ్చిన అతిధులకు ఆడ్మర్స్ పిగెట్ వాచ్‌లను గిఫ్ట్‌లుగా ఇచ్చాడు అనంత్ అంబానీ. అవి కూడా చాలా లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌లను వారికి అందించాడు. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ల ధర రూ.1.5 కోట్లు ఉంటుందని సమాచారం. అంటే తన పెళ్లికి వచ్చినందుకు ఒక్కొక్కరికి రూ.1.5 కోట్ల బహుమతిని అందించాడు అనంత్. ఇది తెలిసి నెటిజన్లు ఒక్కసారిగా షాకవుతున్నారు. షారుఖ్ ఖాన్, మీజన్, రణవీర్ సింగ్, షికార్ పహారియా, వీర్ పహారియా.. ఇలా పలువురికి ఈ వాచ్‌లు అందాయి. ఈ గిఫ్ట్‌ను అందుకున్న వారంతా తమ వాచ్‌లను చూపిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.






ఎంతోమంది సెలబ్రిటీలు..


పింక్, గోల్డ్ కలర్స్ కలిపిన డయల్‌తో ఈ వాచ్‌లు చాలా బాగున్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జులై 12న అనంత్ అంబానీ, రాధికల పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లి పూర్తయిన తర్వాత కూడా శుభ్ ఆశీర్వాద్ అనే పేరుతో మరో గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించింది అంబానీ ఫ్యామిలీ. ఇక ఈ పెళ్లి కోసం అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన కిమ్ కర్దాషిన్ కూడా ఇండియాలో అడుగుపెట్టింది. యూకే మాజీ ప్రధాన మంత్రులు అయిన బోరీస్ జాన్సన్, టోనీ బ్లెయర్ కూడా ఈ పెళ్లికి హాజరవ్వడం విశేషం.



Also Read: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో చీరలో మెరిసిన రష్మిక - చూడడానికి సింపుల్‌గా ఉన్నా ఈ శారీ ధర ఎంతో తెలుసా?