SSMB29: మహేశ్ బాబును రిలీజ్ చేసిన రాజమౌళి - 'ఎస్ఎస్ఎంబి 29' షూటింగ్ పూర్తి కాకుండానే ఎందుకిలా.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

SSMB29 : 'ఎస్ఎస్ఎంబి 29' షూటింగ్ పూర్తి కాకుండానే రాజమౌళి బోన్ నుంచి మహేష్ బాబు రిలీజ్ వెనకున్న సీక్రెట్ ఏంటో తాజాగా బయటకొచ్చింది. మహేష్ వెకేషన్ కు వెళ్ళడానికి కారణం రాజమౌళి కావడం విశేషం. అదెలాగంటే?

Continues below advertisement

Rajamouli Secret Behind SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ 'SSMB29'. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉందన్న సంగతి తెలిసిందే. మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండగానే మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్లిపోయారు. సాధారణంగా తన సినిమాలను ఏళ్ల తరబడి చెక్కుతారని, మూవీ పూర్తయ్యే వరకూ నటీనటులను విడిచి పెట్టరన్న పేరుంది జక్కన్నకు. కానీ విచిత్రంగా మహేష్ మూవీ కోసం ఆయన రూల్స్ అన్నింటినీ తిరగరాస్తున్నారు. దానికి నిదర్శనమే మూవీ షూటింగ్ మధ్యలో మహేష్ ఫ్యామిలీ ట్రిప్‌నకు వెళ్లడం. తాజాగా మహేష్ ట్రిప్ వెనకున్న సీక్రెట్ ఏంటో వెల్లడైంది. 

Continues below advertisement

మహేష్ బాబు ట్రిప్ వెనకున్న సీక్రెట్ ఇదే 
ఇటీవల మహేష్ బాబు విమానాశ్రయంలో తన పాస్‌ పోర్ట్‌‌ను ఫోటోగ్రాఫర్లకు చూపిస్తూ, తాను రాజమౌళి బోను నుంచి బయటకొచ్చానని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. అయితే జక్కన్న సినిమా అనగానే కొన్ని రూల్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా తన సినిమాలో నటిస్తున్న హీరో షూటింగ్ పూర్తయ్యేదాకా బహిరంగంగా కనిపించకూడదు. అలాగే సినిమా షూటింగ్ ఎన్నేళ్లు జరిగినా, పూర్తయ్యే వరకూ తన సినిమా మాత్రమే చేయాలి. మధ్యలో వెకేషన్లు, బ్రేకులు లాంటివేమీ ఉండవు. కానీ మహేష్ కోసం తన రూల్స్ అన్నింటినీ మార్చేస్తున్నారు రాజమౌళి. సాధారణంగా ఒక సినిమాకు 3 నుంచి 5 ఏళ్లు టైమ్ తీసుకునే జక్కన్న ఈ మూవీని మాత్రం రెండేళ్లలోనే పూర్తి చేసి, రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 

ఇదే ఒక సంచలనం అనుకుంటే ఇప్పుడు మహేష్ మూవీ షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాకముందే వెకేషన్‌కు వెళ్లిపోయారు. మరి మహేష్ వెకేషన్ వెనుకున్న సీక్రెట్ ఏంటంటే జక్కన్నే. ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగానే, మరో మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి జపాన్‌లో 'RRR' షూటింగ్ ఆధారంగా రూపొందించిన 'బిహైండ్ & బియాండ్' డాక్యుమెంటరీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జపనీస్ అభిమానులతో ముచ్చటించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలా ఇటు జక్కన్న జపాన్‌లో బిజీ కాబట్టి, ఈ గ్యాప్‌లో మహేష్ ఓ ట్రిప్ ప్లాన్ చేశారన్నమాట. ఇక జక్కన్న కూడా మారు మాట్లాడకుండా మహేష్‌కు పాస్ పోర్ట్ ఇచ్చేసి, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. 

ఇటలీలో మహేష్ బాబు వెకేషన్ 
మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేనితో కలిసి ఇప్పుడు యూరోపియన్ విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. ఇటలీలోని టస్కానీలో సూపర్ స్టార్ ఫ్యామిలీ సేద తీరుతోంది. రెండ్రోజుల కిందట నమ్రతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు పంచుకున్నారు. ఇదిలా ఉండగా, రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటించే అవకాశం ఉంది. ఈ మూవీని 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Continues below advertisement
Sponsored Links by Taboola