SSMB 29 : మహష్ బాబు సినిమా కోసం జక్కన్న కీలక నిర్ణయం... 'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ కలిసి వచ్చేలా 'ఎస్ఎస్ఎంబి 29' రిలీజ్ డేట్ ప్లాన్... కానీ?

SSMB 29 Release Date : మహష్ బాబు 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ రిలీజ్ డేట్‌ను జక్కన్న ఫిక్స్ చేశాడని, 'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ కలిసి వచ్చేలా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Continues below advertisement

SSMB29 Movie Update: దర్శక దిగ్గజం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 'ఎస్ఎస్ఎంబీ29' సినిమాకు సంబంధించిన రోజుకో వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు జక్కన్న మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడని టాక్ నడుస్తోంది. సమాచారం ప్రకారం 'ఎస్ఎస్ఎంబి 29' మూవీని 2027 మార్చిలో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి తోడు 'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ కూడా జరగబోతున్నాయి. 

Continues below advertisement

'ఎస్ఎస్ఎంబి 29' మూవీ రిలీజ్ డేట్ ఇదేనా?
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సూపర్ స్టార్ అభిమానుల సంబరం అంబరాన్ని తాకింది. ఇక చాలాకాలం నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు జనవరిలో పట్టాలెక్కింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా, మూడో షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2027 మార్చి 25న రిలీజ్ కాబోతోందనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రాలేదు. కానీ మార్చి 25న గురువారం కావడం గమనార్హం. ఎప్పటిలా ఫ్రైడే కాకుండా మూవీ గురువారమే థియేటర్లలోకి రానుందన్నమాట. 

అదే రోజున 'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్  
'ఎస్ఎస్ఎంబి 29' మూవీ మార్చ్ 25న రిలీజ్ కాబోతుందనే వార్త జక్కన్న అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేసింది. ఎందుకంటే సరిగ్గా మూడేళ్ల క్రితం అంటే 2022 మార్చ్ 25న రాజమౌళి రూపొందించిన మాగ్నం ఓపస్ 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఘన విజయాన్ని సాధించి, తెలుగు చిత్రసీమకు మొదటి ఆస్కార్‌ను సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి నుంచి రెండేళ్ల తర్వాత మళ్లీ మార్చ్ 25న రాజమౌళి - మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ ఊచకోత పక్కా అంటున్నారు అభిమానులు. అలాగే 2025 మార్చి 25 నాటికి 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ అయ్యి, ఐదు ఏళ్ళు పూర్తవుతుంది. మరి మేకర్స్ దీనికి సంబంధించిన స్పెషల్ సెలబ్రేషన్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. 

రాజమౌళి - మహేష్ సినిమాకు కలిసొచ్చే పండుగలు 
ఒకవేళ రాజమౌళి గనక నిజంగానే ప్రచారం జరుగుతున్నట్టుగా మూవీని ఇదే డేట్‌కు రిలీజ్ చేయాలని అనుకుంటే జక్కన్న ప్లానింగ్ అదిరిపోయినట్టే. ఎందుకంటే వరుసగా పండగలు కలిసి రాబోతున్నాయి. 2027లో మార్చ్ 25న రిలీజ్ అనుకుంటే, ఈ మూవీ రిలీజ్ అయినా వారం తర్వాత అంటే ఏప్రిల్ 7న ఉగాది, ఆ తర్వాత మరో వారానికి అంటే ఏప్రిల్ 15న శ్రీ రామనవమి పండగలు ఉన్నాయి. ఇక మరోవైపు ఈ రిలీజ్ డేట్ విషయంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా రాజమౌళి అభిమానులను భయపెడుతోంది. ఇది రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 13వ సినిమా. జక్కన్న ఇప్పటిదాకా రూపొందించిన సినిమాలన్నీ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కానీ ఆయన దర్శకత్వంలో రూపొందిన మూడవ మూవీ 'సై' మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలవడం గమనార్హం. మరి 'ఎస్ఎస్ఎంబి 29' విషయంలో జక్కన్న ఈ 3 సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తారా? అనేది చూడాలి.

Continues below advertisement