Do You Know Lifebuoy Ad Child Artist How She Looks: ఒకప్పుడు వెండితెరపై అలరించి చైల్డ్‌ ఆర్టిస్ట్స్‌ ఇప్పుడు హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తమ క్యూట్‌ క్యూట్‌ మాటలతో ఆకట్టుకున్నవారంతా ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారి యాక్షన్‌, గ్లామర్‌తో మెప్పిస్తున్నారు. అయితే అందులో కొందరు కనుమరుగైనవారు కూడా ఉన్నారు. బాలానటులుగా ఒక్క సినిమాతో పాపులర్‌ అయ్యి ఆ తర్వాత చదువు కోసం యాక్టింగ్‌ మానేసిన బాలనటులు కూడా ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం నటనపై ఇష్టంతో తిరిగి సినిమాల్లో నటిస్తూ వెండితెరపై ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. అందులో ఈ లైఫ్‌ బాయ్ యాడ్‌ చిన్నది కూడా ఉంది.


'లైఫ్‌ బాయ్‌' హ్యాండ్‌ వాష్‌ ప్రకటనలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు తన అందంతో కుర్ర కారుకు నిద్ర లేకుండ చేస్తుంది. "బంటి.. నీ సబ్బు స్లోనా" అంటూ క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడిన ఈ చిన్నది ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తుంది. అంతేకాదు పలు షోలు, టీవీ సీరియల్సోనూ నటించి మెప్పిస్తుంది. ఇక ఈ బ్యూటీ తన గ్లామర్‌ లుక్‌తో సోషల్‌ మీడియా సెన్సేషన్‌ కూడా అవుతుంది. మూవీ ఈవెంట్స్‌తో తళుక్కున మెరుస్తూ తన అందంతో ఆకట్టుకంటుంది. దీంతో తన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వీపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.






అంతగా తన అందం, గ్లామర్‌ లుక్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నారి పేరు అవినీత్‌ కౌర్‌. ఇప్పుడు ఈ చిన్నారే ఎవరో గుర్తుపట్టారా? సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈమే పేరు బాగా సుపరిచితమే. ఎందుకంటే ఎప్పుడు తన గ్లామరస్‌ లుక్‌తో ఈ భామ నెట్టింట సందడి చేస్తూ ఉంటుంది. అలా లైఫ్‌ హ్యాండ్‌ వాష్‌ ప్రకటనలో నటించిన ఈ చిన్నారి... చాలా గ్యాప్‌ తర్వాత హీరోగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2001 అక్టోబర్‌ 13న జన్మించిన ఆమె వయసు ఇప్పుడు 22 సంవత్సరాలు. మోడల్‌, డ్యాన్సర్ అయిన అవినీత్‌ కౌర్‌ 2014లో 'మర్దానీ' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో మీరాగా తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత దోస్త్‌ అనే షార్ట్‌ ఫిలింలో నటించింది. ‌


'కరీబ్‌ కరీబ్' సింగల్‌ అనే మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. సినిమాల కంటే ముందు ఈ చిన్నది డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్‌ షో కంటెస్టెంట్‌గా చేసింది. ఈ డ్యాన్స్‌ తన డ్యాన్స్‌ పర్ఫెమెన్స్‌ అదరగొట్టింది. బెల్లి డ్యాన్స్‌, అరుదైన స్టేప్స్‌ వేసి జడ్జస్‌ను మెస్మరైజ్‌ చేసింది. అలా పలు డ్యాన్స్‌ షోలలో తన డ్యాన్స్‌ ఆకట్టుకున్న అవినీత్‌ ఇప్పుడు హీరోయిన్‌ వెండితెరపై మెస్మరైజ్‌ చేస్తుంది. తనదైన అందం, అభినయం యువత మతిపోగోడుతుంది. ఇక సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసే గ్లామర్స్‌ ఫోటోలు అయితే కుర్రకారుకు నిద్రపట్టకుండ చేస్తాయి. నెట్టింట ఎక్కడ చూసిన అవినీత్‌ కౌర్ ఫోటలే దర్శనం ఇస్తాయి.


Also Read: స్టార్‌ హీరో అజిత్‌ బర్త్‌డే - ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన శాలిని, వీడియో వైరల్‌






ఇక మూవీ ఈవెంట్‌ ఏదైనా మీడియా కెమెరాలు అవినీత్‌నే ఫాలో అవుతుంటాయి. అంతగా ఈ భామ తన అందం ఆకట్టుకుటుంది. ఎప్పుడు స్టైలిస్‌ వేర్‌, స్కిన్‌ టైట్‌, బాడీకాన్‌ టాప్స్‌తో ఈ బ్యూటీ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటుంది. అందుకే ఆమె మీడియా కెమెరాలతో పాటు అబ్బాయిల చూపు ఎప్పుడు ఆమెనే పడుతుంటాయి. అంతగా తన హాట్‌ లుక్‌తో ఆకట్టుకుంటుంది ఈ 'లైఫ్ బాయ్‌' యాడ్‌ చిన్నది. రీసెంట్‌గా అవినీత్‌ కౌర్‌ 'మార్దానీ 2'. ఇక చివరిగా టీకు వెడ్స్‌ శేరు మూవీ నటించిన అవినీత్‌ ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్‌, సినిమాలతో బిజీగా ఉంది.