Divya Bharathi Kingston Interview: సంగీత దర్శకుడిగా సక్సెస్ చిత్రాలతో దూసుకెళుతున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించడంతో పాటు నిర్మించిన చిత్రం ‘కింగ్స్టన్’. ఈ శుక్రవారం (మార్చి 7)న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఫస్ట్ సి అడ్వెంచర్ త్రిల్లర్ చిత్రమిది. జీవీ ప్రకాష్ కుమార్ సరసన ఇందులో దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది. ‘బ్యాచిలర్’ తర్వాత జీవీ ప్రకాష్, దివ్యభారతి మరోసారి కలిసి నటించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర హీరోయిన్ దివ్యభారతి తెలుగు మీడియాకు చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. 


‘‘ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం హైదరాబాద వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ ‘మహారాజా’లో కనిపించింది తక్కువ సమయమే అయినా, తెలుగులో కూడా ఆ సినిమా విజయం సాధించడంతో నన్ను కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టేస్తున్నారు. తమిళంలో నా పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో, తెలుగు ప్రేక్షకులు కూడా నా పాత్ర అంతే చక్కగా ఆదరించారు. టాలీవుడ్ నుంచి ఎన్నో ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. జీవీతో చేసిన ‘బ్యాచిలర్’ మంచి హిట్టయింది. అది తెలుగులో రిలీజ్ చేస్తారని అనుకోలేదు. తెలుగులోనూ ఆ సినిమాకు పాజిటివ్ స్పందనే వచ్చింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ‘కింగ్స్టన్’ చాలా డిఫరెంట్ మూవీ. ఇండియాలోనే ఫస్ట్ సీ అడ్వెంచర్ థ్రిల్లర్. అందులోనూ జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమాలో నేను హీరోయిన్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఆయన ఒక్కరే నిర్మాత. తర్వాత జీ స్టూడియోస్ యాడ్ అయ్యారు. ఈ సినిమా కోసం జీవీ చాలా కష్టపడ్డారు.


Also Read: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - 'ఖాకీ 2' వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారా.?, ఆ వార్తల్లో నిజమెంత!


నా అదృష్టం.. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాను. అంతేకాదు, నాపై యాక్షన్ పార్ట్ కూడా ఉంది. చాలా అరుదుగా నటీమణులకు ఇలాంటి పాత్రలు లభిస్తాయి. ఫస్ట్ టైమ్ యాక్షన్ సన్నివేశాలు చేయడం కొంత థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇందులో నేను రోప్ సీన్స్ కూడా చేశా. ఫస్ట్ టైమ్ యాక్షన్ సీన్స్ చేయడం ఎంత కష్టమో నాకు తెలిసివచ్చింది. ఇటువంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ మళ్లీ నాకు వస్తుందో లేదో తెలియదు. యాక్షన్ సీన్స్ చేసేప్పుడు చాలా భయపడ్డా. యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు. ఆ సీన్స్ కోసం ముందే కొంత ప్రిపేర్ అయ్యాను. ‘బ్యాచిలర్’లో నేను సిటీ గాళ్‌గా కనిపిస్తే.. ఇందులో మాత్రం ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను. సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు చేపలు పట్టడానికి ఎందుకు వెళ్లరు? వాళ్ళకు ఉన్న శాపం ఏమిటి? దాన్ని హీరో హీరోయిన్లు ఏం చేశారు? అనేదే ఈ సినిమా. నాది హీరో గాళ్ ఫ్రెండ్ రోల్. ఊరిని కాపాడటం కోసం హీరో చేసిన ప్రయత్నానికి హీరోయిన్ ఎలా సాయం చేసింది? అతనితో కలిసి సముద్రంలో ఎందుకు వెళ్ళింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను సినిమా చూశాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ‘కింగ్స్టన్’ను ఫ్రాంచైజీగా చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తర్వాత రాబోయే భాగాల్లో కూడా నా పాత్ర కంటిన్యూ అవుతుంది.


నాకు తెలుగు బాగా వచ్చు. తెలుగులో నేను ఒక స్ట్రయిట్ మూవీ కూడా చేశాను. సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన ‘గోట్’ విడుదలకు సిద్ధమవుతుంది. నా అసిస్టెంట్ తెలుగు వ్యక్తి. అతని దగ్గర నేను తెలుగులో మాట్లాడతాను. అలా నేను తెలుగు భాష నేర్చుకుంటున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. ‘ఖుషి’ నాకు చాలా ఇష్టమైన సినిమా. నా తర్వాత ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు చేశాను. తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలను టీమ్ తెలియజేస్తుంది’’ అని దివ్యభారతి చెప్పుకొచ్చింది.


Also Read: జాన్వీ కపూర్ బర్త్ డే గిఫ్ట్ - రామ్ చరణ్ 'RC16' నుంచి పోస్టర్ రిలీజ్, లుక్ అదిరిందిగా..