Janhvi Kapoor's First Look Revealed From RC16 Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు (Buchibabu) సానా దర్శకత్వంలో లేటెస్ట్ మూవీ 'RC16' వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గురువారం (మార్చి 6) జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా 'RC16'లో ఆమె ఫస్ట్ లుక్‌ను మూవీ టీం తాజాగా రిలీజ్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్‌కు (Janhvi Kapoor) పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ కొత్త పోస్టర్‌ను రివీల్ చేసింది. ఇందులో జాన్వీ పల్లె వాతావరణంలో కుడి చేతిలో ఓ గొర్రె పిల్ల, ఎడమ చేతిలో ఓ గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ చాలా అందంగా కనిపించారు. ఇది ఓ పాటలో స్టిల్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ పోస్టర్ విడుదల చేసిన కొద్దిసేపటికే నెట్టింట వైరల్ అవుతోంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో..
ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా రూపొందుతుండగా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఇన్ని రోజులు మైసూర్లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసిన మేకర్స్, ఇప్పుడు పార్లమెంట్, జామా మసీదు వంటి ఐకానిక్ ప్రదేశాల్లో షూటింగ్ కోసం న్యూఢిల్లీకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్‌పై పలు కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయనున్నట్లు సమాచారం. సంబంధిత అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూవీలో న్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. మూవీకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ ప్రారంభమయ్యాయని.. 2 పాటలు కూడా పూర్తి చేసినట్లు ఇటీవలే రెహమాన్ తెలిపారు.
Also Read: ఏడాది తర్వాత ఆ ఓటీటీలోకి శర్వానంద్ 'మనమే' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
టైటిల్ అప్పుడేనా..
మరోవైపు, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్ పెడతారని ప్రచారం సాగింది. అయితే, రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా మూవీకి సంబంధించి టైటిల్‌ను ఈ నెల 27న అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చెర్రీ బర్త్ డేని భారీ ఎత్తున సెలెబ్రేట్ చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెడుతున్నారు మెగా అభిమానులు ఈ కొత్త సర్ ప్రైజ్ కోసం మరింత ఆసక్తి చూపుతున్నారు.
Also Read: నయనతార రూల్ మార్చేశారా.? - కొత్త సినిమా ప్రారంభంలో నయన్, ఆమేనా అంటూ నెటిజన్లు షాక్