Ramam Raghavam OTT Release Date: రెండు ఓటీటీల్లోకి కమెడియన్ ధన్‌రాజ్ 'రామం రాఘవం' మూవీ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.?
Ramam Raghavam OTT Platform: కమెడియన్ ధన్‌రాజ్, సముద్రఖని తండ్రీ కొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'రామం రాఘవం'. ఇప్పటికే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించగా.. 'సన్ నెక్స్ట్'లోనూ రానుంది.
Ramam Raghavam OTT Release On Sun NXT And ETV Win: జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ (Dhan Raj) స్వీయ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సముద్రఖని (Samuthirakhani) కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రామం రాఘవం' (Ramam Raghavam). ఈ మూవీలో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా నటించారు. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 'ఈటీవీ విన్' ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించగా.. రిలీజ్ తేదీ వెల్లడించలేదు. తాజాగా, మరో ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నెల 14 నుంచి 'సన్ నెక్స్ట్'లో స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈ తండ్రీ కొడుకల ప్రయాణం మీరు ఊహించలేనిది.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ మూవీలో మోక్ష, హరీష్ ఉత్తమన్, వాసు ఇంటూరి, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, సునీల్, రాకెట్ రాఘవ, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. 'విమానం' సినిమా దర్శకుడు శివప్రసాద్ యానాల స్టోరీ అందించగా.. అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందించారు.
ఈ తండ్రీ కొడుకుల కథేంటంటే..?
కమెడియన్‌గా పలు చిత్రాలతో మెప్పించిన ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కించిన మూవీ 'రామం రాఘవం'. కొడుకు గొప్పగా ఉండాలని కలలు కన్న ఓ తండ్రి.. తండ్రి ఆశయాలను పట్టించుకోకుండా జులాయిగా తిరిగే కొడుకు.. ప్రతీ ఫ్యామిలీలో జరిగే సెంటిమెంట్, ఎమోషన్స్‌ను చక్కగా చూపించడంలో ధన్ రాజ్ సక్సెస్ అయ్యారు. ఇక కథ విషయానికొస్తే.. తండ్రి దశరథ రామం (సముద్రఖని) కోనసీమ జిల్లాలోని ఓ గ్రామంలో రిజిస్టార్ ఆఫీస్‌లో ఉద్యోగిగా చేస్తుంటారు. ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా నీతి, నిజాయితీగా తన ఉద్యోగం చేస్తుంటాడు. ఆ తండ్రికి కొడుకు రాఘవ (ధన్ రాజ్). తన కొడుకుని డాక్టర్‌ను చేయాలని రామం కలలు కంటాడు. అయితే, తండ్రిని పట్టించుకోకుండా చదువు మానేసి చిన్నప్పటి నుంచే వ్యసనాలకు బానిపై జులాయిగా తిరుగుతుంటాడు రాఘవ. కొడుకుని చూసి బాధ పడుతూ అతన్ని మార్చాలని ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు తండ్రి. దీంతో చివరకు విసిగి వేసారి కొడుకును అసహ్యించుకుంటాడు. ఈ క్రమంలోనే రాఘవ వేగంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌లకు పాల్పడుతూ ఊరంతా అప్పులు చేస్తాడు.
Also Read: ఊర్వశీ.. నీకన్నా ఉర్ఫీనే బెటర్ - సోషల్ మీడియాలో ఏకి పారేస్తోన్న నెటిజన్లు
ఆ అప్పులు తీర్చే మార్గం లేక సతమవుతూ ఉంటాడు. ఆ సమయంలో తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి దొరికిపోతాడు. దీంతో రామంపై అవినీతిపరుడు అనే ముద్ర పడగా.. కొడుకును ఇంట్లో నుంచి గెంటేస్తాడు. దీంతో ఆస్తి, ఉద్యోగం, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రినే చంపాలనుకుంటాడు రాఘవ. దీంతో జరిగిన పరిణామాలేంటి.?, తండ్రి ప్రేమ, గొప్పతనాన్ని కొడుకు తెలుసుకున్నాడా.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read: సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసినా నో క్రేజ్ - ఇప్పుడు గూగుల్ ఇండియాలో టాప్ పొజిషన్‌లో..