Urvashi Rautela Faces Trolls For Red Carpet Outfit At Paris Event: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సరికొత్త గ్లామర్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. తన ప్రయాణాలు, ఫ్యాషన్ ఈవెంట్స్ గురించి తరచూ నెట్టింట షేర్ చేసుకుంటుంది. తాజాగా ఆమె స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట తెగ ట్రోలింగ్ మొదలైంది. కొందరు ఫ్యాన్స్ పాజిటివ్‌గా కామెంట్ చేస్తుంటే మరికొందరు ఫ్యాన్స్ నెటిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఊర్వశీ.. ఇటీవల ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై నడుస్తోన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ దుస్తులపై ట్రోలింగ్ మొదలైంది.

ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ఊర్వశీరౌతేలా ఈవెంట్‌లో రెడ్ కార్పెట్‌పై పసుపు 3D పువ్వులతో అలంకరించిన గౌనులో కనిపించారు. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ గౌన్ ధరించగా.. అందులో బ్లాక్ కలర్ ఫాబ్రిక్ మీద పెద్ద పెద్ద పూల డిజైన్స్‌తో ఉన్న ఈ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటోంది. బంగారు రంగులోని ఝుమ్కీలు, ఎత్తైన ఫోనీతో రాయల్ లుక్ టచ్‌లో అదిరిపోయింది. ఈ వీడియోను షేర్ చేసిన రౌతేలా.. 'పారిస్.. ఎల్లప్పుడూ మంచి ఆలోచన' అంటూ ఫ్రెంచ్‌లో రాసుకొచ్చారు. కొంతమంది నెటిజన్లు ఆమె దుస్తులను మెచ్చుకుంటున్నప్పటికీ కొందరు ఆమె దుస్తులను ట్రోల్ చేస్తున్నారు. 'తోటలా కనిపించే బాలీవుడ్ నటి' అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. మరొకరు 'జంగీలా కనిపించే మొదటి ఆసియన్' అంటూ కామెంట్ చేశారు. 'ఇది వింతగా ఉంది.. కానీ బాగాలేదు.', మరొకరు 'ఈ దుస్తులు ఉర్ఫీ జావేద్‌కే బాగున్నాయి.' 'విచారంగా ఉంది.. డిజైనర్లు ఆమె కోసం ఏదైనా చేస్తారు.' అంటూ కామెంట్స్ చేశారు.

Also Read: ఒరిస్సాలో అడుగు పెట్టిన మహేష్... రాజమౌళి సినిమా కోసం, ఆయనతో వెళ్లిందెవరో గుర్తు పట్టారా?

నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల తెలుగులో బాలకృష్ణ 'డాకు మహారాజ్'లో నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఊర్వశీ  బాలయ్యతో కలిసి ఆమె 'దబిడి దిబిడి' పాటకు డ్యాన్స్ వేశారు. ఈ సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఓ స్టెప్ విదాస్పదమైంది. ఆ స్టెప్‌పై నెట్టింట విమర్శలు రాగా ఊర్వశీ స్పందించారు. 'జీవితంలో ఏం సాధించలేని కొందరు.. కష్టపడే వారిని విమర్శించే అర్హత ఉందనుకుంటారు. ఇది విడ్డూరంగా ఉంది. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు. వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడం.' అంటూ ఓ నెటిజన్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు. డ్యాన్స్, నటనకు ప్రాధాన్యమున్న ఎలాంటి భిన్నమైన సినిమాలనైనా తాను గౌరవిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: చిరంజీవి ‘ముఠామేస్త్రి’, వెంకటేష్ ‘సూర్యవంశం’ to ప్రభాస్ ‘మున్నా’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ వరకు - ఈ గురువారం (మార్చి 6) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్