Nayanthara Attend MookuthiAmman2 Pooja Event: ప్రముఖ నటి నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ముక్తి అమ్మన్' 2020లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో మెప్పించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా సి.సుందర్ దర్శకత్వంలో 'ముక్తి అమ్మన్ 2' (Mookuthi Amman 2) తాజాగా ప్రారంభమైంది. చెన్నైలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం జరగ్గా.. దర్శకుడు సి.సుందర్‌తో (C.Sundar) పాటు ప్రముఖ హీరోయిన్స్ నయనతార, మీనా, ఖుష్బూ, రెజీనా ఈవెంట్‌లో కనిపించారు. కార్యక్రమంలో అమ్మవారికి నయనతార నమస్కరిస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

షాక్ అవుతోన్న నెటిజన్లు

నయనతార.. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె ఇన్ని సినిమాల్లో నటించినా.. సినిమా పూజా కార్యక్రమం, ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఎప్పుడూ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. అయితే, తాజాగా తన కొత్త చిత్రం 'ముక్తి అమ్మన్ 2' ప్రారంభ ఈవెంట్‌లో కనిపించి సందడి చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నయనతార అమ్మవారికి నమస్కరిస్తోన్న వీడియోలు షేర్ చేస్తూ.. 'ఆమె నిజంగా నయనతారేనా.. ఇదేంటీ కొత్తగా..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'మనస్సినక్కరే' అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన నయనతార ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ సినిమాల్లో నటించి మెప్పించారు. 

Also Read: ఊర్వశీ.. నీకన్నా ఉర్ఫీనే బెటర్ - సోషల్ మీడియాలో ఏకి పారేస్తోన్న నెటిజన్లు

రూ.100 కోట్ల భారీ బడ్జెట్

నయనతార 'మూకుత్తి అమ్మన్' (Mookuthi Amman) ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించగా.. తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'ముక్తి అమ్మన్ 2' వస్తుండగా.. దర్శకుడు సి.సుందర్ తెరకెక్కిస్తున్నారు. నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో నటిస్తుండగా.. మూవీ దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో ముక్కుపుడక అమ్మవారిగా నయనతార కనిపించారు. భక్తి పేరుతో దొంగబాబాలు చేసే మోసాలు, వారి పని పట్టే క్రమంలో హీరో ఎదుర్కొన్న పరిణామాలు, అతనికి అమ్మవారు ఎలా సాయం చేశారనేదే ప్రధానాంశంగా చిత్రాన్ని తెరకెక్కించారు. తొలి భాగానికి భిన్నంగా సెకండ్ పార్ట్ ఉంటుందని.. గ్రాఫిక్స్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవనీ సినిమాక్స్, IVY ఎంటర్‌టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

సుమారు 30 రోజుల్లోనే దర్శకుడు సుందర్ ఈ కథను సిద్ధం చేశారని.. ఇలాంటి కథను ఈ మధ్య కాలంలో తాను వినలేదని నిర్మాత గణేష్ చెప్పారు. 'ఈ కొత్త సినిమాలో అమ్మవారి పాత్రలో నయనతార కనిపిస్తారు. మూవీ కోసం ఆమె నెల రోజుల పాటు ఉపవాసం చేస్తున్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నాం.' అని పేర్కొన్నారు.

Also Read: రెండు ఓటీటీల్లోకి కమెడియన్ ధన్‌రాజ్ 'రామం రాఘవం' మూవీ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా.?