Tamannaah And Vijay Varma Breakup Reasons: మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో 'లవ్ బర్డ్స్' అనే ట్యాగ్ సొంతం చేసుకున్న ఈ జంట రిలేషన్ షిప్‌నకు బ్రేక్ పడిందంటూ తాజాగా వార్తలు హల్చల్ చేశాయి. వీరిద్దరూ విడిపోయారంటూ కొన్ని ఆంగ్ల పత్రికల కథనాల్లో ప్రచురితమైంది. దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ కొనసాగకపోవడానికి కారణం ఏమై ఉంటుందా..?, అని నెట్టింట చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే పలు కథనాలు తెరపైకి వస్తున్నాయి. పెళ్లి, కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని.. అందుకే బ్రేకప్ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. 35 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా.. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలని నిర్ణయించుకోగా.. విజయ్ వర్మ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఆయన కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు బీటౌన్‌లో చర్చించుకుంటున్నారు. దీని కారణంగానే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారని అనుకుంటున్నారు. మరోవైపు, ఈ వార్తలపై అటు తమన్నా కానీ ఇటు విజయ్ వర్మ కానీ స్పందించలేదు.
ఫోటోలు డిలీట్ చేసిన తమన్నా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తమన్నా తమ పర్సనల్ ఫోటోలను మాత్రం ఎప్పుడూ షేరే చేయలేదు. 2023లో విడుదలైన 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ చేసేటప్పుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడ్డారు. అందులో ఘాటు సన్నివేశాల్లోనూ నటించారు. ఈ సిరీస్ రిలీజ్ కావడానికి ముందే గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వీడియో తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో వాళ్లిద్దరూ లిప్ లాక్ పెట్టుకోవడంతో వీరి ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయాన్ని తమన్నా కన్ఫర్మ్ చేశారు. 'నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నా. నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్ వర్మ ఆ ప్రపంచంలోకి వచ్చాడు. తను నన్ను అన్నీ విషయాల్లో గౌరవిస్తాడు. నన్నెంతో అర్థం చేసుకున్నాడు.' అని చెప్పారు.
Also Read: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - 'ఖాకీ 2' వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారా.?, ఆ వార్తల్లో నిజమెంత!
అప్పటి నుంచి దాదాపు రెండేళ్లు వీరిద్దరూ ఈవెంట్స్, ఫ్యాషన్ షోలు, ఇతర కార్యక్రమాలకు కలిసి హాజరయ్యారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు సైతం ఎక్కుతారనే ప్రచారం సాగింది. అయితే, సడన్‌గా విజయ్ వర్మ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతా నుంచి తమన్నా డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ విడిపోయినా సరే మంచి స్నేహితులుగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా 'ఓదెల 2'లో నటిస్తున్నారు. ఇటీవల మహా కుంభమేళాలో సినిమా టిజర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది.
Also Read: జాన్వీ కపూర్ బర్త్ డే గిఫ్ట్ - రామ్ చరణ్ 'RC16' నుంచి పోస్టర్ రిలీజ్, లుక్ అదిరిందిగా..