Kiran Abbavaram's DilRuba Trailer: 'క'తో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) 50 కోట్ల రూపాయల క్లబ్బులో చేరారు. ఆ సినిమా తెలుగు వెర్షన్ 50 ప్లస్ క్రోర్స్ గ్రాస్ సాధించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా హీరోకి పేరు తెచ్చింది. 'క' తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి రిలీజ్ అవుతున్న సినిమా 'దిల్ రూబా' (DilRuba Movie). ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అది చూస్తే... కిరణ్ అబ్బవరం ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దిగినట్టు అర్థం అవుతోంది.
ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నారు!
Watch DilRuba Trailer Here: 'దిల్ రూబా' ట్రైలర్ మొత్తం మీద 'ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నాడు ప్రతివోడూ' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. యాక్షన్ సీన్స్ కూడా స్టైలిష్‌గా కంపోజ్ చేశారని అర్థం అవుతోంది. యాటిట్యూడ్ ఉన్న కుర్రాడిగా కిరణ్ అబ్బవరం బాగా నటించారు. ఇక సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా బావున్నాయి. హీరోకి థాంక్స్, సారీ పదాలు చెప్పడం ఇష్టం ఉండదు. దాంతో అతను ఎటువంటి సందర్భాలు ఎదుర్కొన్నాడు? జీవితంలో ఏమైంది? వంటివి సినిమాలో చూసి తెలుసుకోవాలి.
'తప్పు చేయనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ', 'తప్పు చేయని ప్రతివోడూ నా దృష్టిలో హీరో', 'వాడు చేసిన తప్పును రియలైజ్ అవుతాడు చూడు... వాడు ఇంకా పెద్ద హీరో' అని కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగులు కూడా హైలైట్ అయ్యాయి.
మార్చి 14న థియేటర్లలోకి 'దిల్ రూబా
'Dillruba movie release date: 'దిల్ రూబా'లో కిరణ్ అబ్బవరం సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించారు. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమకు చెందిన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంస్థలపై తెరకెక్కిన ఈ సినిమాకు రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభించిందని, 'దిల్ రూబా' సినిమా కూడా ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్, కూర్పు: ప్రవీణ్ కేఎల్, ఛాయాగ్రహణం: డానియేల్ విశ్వాస్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాతలు: రవి - జోజో జోస్ - రాకేష్ రెడ్డి - సారెగమ, రచన - దర్శకత్వం: విశ్వ కరుణ్.