ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. జూబ్లీ హిల్స్ మీదుగా కారులో ప్రయాణిస్తున్న త్రివిక్రమ్‌ను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఆయన కారుకు బ్లాక్ ఫిలిం ఉండటంతో జరిమానా చెల్లించాలని పోలీసులు త్రివిక్రమ్‌ను కోరారు. అనంతరం బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, రూ.700 జరిమానా విధించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: ‘అనసూయా, పొట్టి బట్టలేసుకుని ఆడపడుచుల పరువు తీస్తున్నావ్’, రంగమత్త స్పందన ఇది!
ఇది నిర్మాత బండ్ల గణేష్ అవకాశంగా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఈ సందర్భంగా విడుదలైన ఓ ఆడియో వారి మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. అయితే, ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని బండ్ల గణేష్ ఇప్పటికే వివరణ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్‌ను దేవర అని పిలిచే వీరాభిమాని బండ్ల గణేష్. అలాగే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. వీరి గొడవల గురించి ఇప్పటి వరకు ఊహాగానాలే నడిచాయి. అయితే, త్రివిక్రమ్ ట్రాఫిక్ పోలీసులకు జరిమానా చెల్లిస్తున్న సమాచారాన్ని పోస్ట్ చేసిన ఓ మీడియా సంస్థ ట్వీట్‌ను బండ్ల గణేష్ రీట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ అకౌంట్లో మాత్రం ఆ ట్వీట్ లేదు. కానీ, ఆయన రీట్వీట్ చేసిన స్క్రీన్ షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్‌ను కేవలం వై-కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తుల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. ఇటీవల మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాహనాలను సైతం పోలీసులు అడ్డుకుని బ్లాక్ ఫిల్మ్‌లు తొలగించి జరిమానా విధించారు.
Also Read: అఖిల్ ‘ఆడ’ పంచాయతీ, మైకు విసిరేసిన బిందు - చేయని తప్పుకు శిక్ష, ఇదిగో ఆధారం!