Anasuya Bharadwaj | యాంకర్, నటి అనసూయకు మళ్లీ కోపం వచ్చింది. అయితే, సారి తన కోపాన్ని ఆగ్రహంలా కాకుండా శాతంగా చెప్పి చూసేందుకు ప్రయత్నించింది. మగజాతి పరువు తీయోద్దంటూ నెటిజనుకు క్లాస్ పీకింది.
ఇటీవల అనసూయకు సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. ఆమె ప్రధాన పాత్రలో ‘దర్జా’ సినిమా కూడా సిద్ధమవుతోంది. ‘రంగస్థలం’ సినిమా నుంచి అనసూయ క్రేజ్ అనూహ్యంగా పెరిగిన సంగతి తెలిసిందే. ‘కిలాడీ’ సినిమాలో అనసూయ అందాల డోసు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో అనసూయపై విమర్శకులు కూడా వస్తున్నాయి. అలాంటి పాత్రలు అవసరమా అనే కామెంట్లు చేస్తున్నారు.
Also Read: అఖిల్ ‘ఆడ’ పంచాయతీ, మైకు విసిరేసిన బిందు - చేయని తప్పుకు శిక్ష, ఇదిగో ఆధారం!
తాజాగా ఓ నెటిజన్ ఈ విధానంగా స్పందించాడు. సందీప్ కొరాటీ అనే వ్యక్తి ‘‘అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు సమాధానంగా అనసూయ్ అతడి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘‘దయచేసి మీరు మీ పని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోవనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’’ అని తెలిపింది. అయితే, ఎప్పటిలా కోపంగా కాకుండా.. దన్నం పెట్టి, స్మైలీలో సమాధానమిచ్చింది అనసూయ.
ఈ విషయంలో అనసూయ అభిమానులు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఎవరెవరు ఏమంటున్నారో ఈ కింది ట్వీట్లలో చూడండి.