కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 4 సోమవారం ఎపిసోడ్


శౌర్య దొరికేవరకూ పెళ్లిచేసుకోనని క్లారిటీ ఇచ్చిన హిమ... మంచి మొగుడు కోసం కాదు నా ప్రశాంతత కోసం గుడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోతుంది. శౌర్యని వెతుకుతూనే ఉన్నాం ఏం చేస్తాం...ఆ శౌర్య ఎప్పుడు దొరుకుతుందో...భగవంతుండా మా శౌర్య తొందరగా కనిపించేలా చూడు అని దేవుడిని వేడుకుంటుంది సౌందర్య.


మరోవైపు గుడికి వెళ్లిన శౌర్య... దేవుడా ఈ రోజు మంచిరోజు అని, నిన్ను కోరుకుంటే మంచి మొగుడొస్తాడని పిన్ని చెప్పింది...కానీ నేను అది ఏదీ కోరుకోవడం లేదు నాకు హిమ కనిపించేలా చేయి, హిమ నాకు కనిపిస్తే చాలు మిగిలినదంతా నేను చూసుకుంటాను, నా బాధ-నా ఆవేశం ఏంటో నీకు తెలుసు. ఏళ్లు గడుస్తున్నా నా బాధ తీరడం లేదు...ఇన్నాళ్లూ నేను పడుతున్న వేదన వందరెట్లు అనుభవించేలా చేస్తాను. అమ్మా-నాన్నని దూరం చేసిన ఆ హిమకి సంతోషాన్ని నేను దూరం చేస్తానంటుంది. ఏదో పెద్దకోరికే కోరావ్ అన్న పూజారితో...ఈరోజు మంచి రోజు ప్రశాంతమైన మనసుతో వేడుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా ఫలిస్తుందని చెప్పి కొబ్బరికాయ కొట్టిరమ్మని చెబుతాడు. కొబ్బరికాయ కొడుతుండగా ఆ కొబ్బరికాయ ముక్క ఎగిరి అప్పుడే మెట్లెక్కుతున్న స్వప్న( సౌందర్య కూతురు, శౌర్యకి మేనత్త)కి తగులుతుంది. 


Also Read:  వసుధారకు ముద్దుపెట్టేసిన రిషి, మ్యాథ్స్‌ సార్‌ షాక్‌లు మామూలుగా లేవు
స్వప్న: కళ్లు కనిపించడం లేదా..
జ్వాల (శౌర్య:) బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయ్, ఇప్పుడే దేవుడిని దర్శనం చేసుకుని వస్తున్నాను
స్వప్న: వెనకాముందూ చూసుకోవాలి కదా...
జ్వాల: ఎందుకలా అరుస్తున్నారు... 
స్వప్న: నేనింతే...చేసిన తప్పుకి సారీ కూడా చెప్పకుండా అలా అరుస్తున్నావేంటి..., ఇంతకీ ఏం చేస్తావ్
జ్వాల: ఆటో నడుపుతుంటా... చిన్నముక్క తగిలినందుకే అంత చేయడం ఎందుకు పోయి దండం పెట్టుకో...
స్వప్న: నీనుంచి సారీ, సంస్కారం ఆశించడం తప్పే...
జ్వాల: పోయి గుడిలో దండం పెట్టుకోమ్మా...


మరోవైపు గుడిలో ఫొటోస్ తీస్తున్న ప్రేమ్...కెమెరాకి అడ్డం వచ్చిన జ్వాల ( శౌర్య) తో తప్పుకో అంటాడు. ఫొటోస్ తీస్తుంటే అడ్డొచ్చావ్ తప్పుకో అంటాడు. EXTRAలు చేయొద్దు ఇందాకే ఓ ఆవిడ నీకన్నా EXTRAలుచేసింది..ఆమె అచ్చం మీ అమ్మలా ఉంది అనగానే...వెనుకనే వచ్చిన స్వప్న...జ్వాల చెంప పగలగొడుతుంది. ఇంకోసారి EXTRAలు అన్నావంటే బాగోదని మరోసారి చేయెత్తడంతో...అడ్డుకున్న జ్వాల గట్టి వార్నింగే ఇస్తుంది. పోనీలే సత్యం సార్ భార్యవని వదిలేస్తున్నా అంటుంది. స్వప్న-జ్వాల వాదించుకుంటూ మళ్లీ చేయెత్తుకుంటారు..ఇంతలో ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ జ్వాల చేయిపట్టుకుంటాడు. 
నిరుపమ్: ఏయ్ రౌడీ బేబీ ఏంటీ గొడవ
స్వప్న: ఏరా ఇది నీక్కూడా తెలుసా...
జ్వాల: డాక్టర్ సాబ్ మీరొచ్చారా... ఏం తింగరి గుడికొచ్చావా
స్వప్న: ఈ పిలుపులేంటి ఈ గొడవేంటి నాకేం అర్థంకావడం లేదు
నిరుపమ్: ఈ గొడవ ఇంతటితో ఆపేయండి...
జ్వాల: డాక్టర్ సాబ్ మీరు చెప్పాక ఆపకుండా ఉంటానా...మీరు చెబితే ఏదైనా చేస్తాను డాక్టర్ సాబ్...
నిరుపమ్: థ్యాంక్యూ...
స్వప్న: దీనికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటి.. మనం ఏంటి మన స్థాయి ఏంటి... ఆఫ్టరాల్ ఆటో నడిపేదాంతో ఫ్రెండ్ షిప్ ఏంటి...
జ్వాల: ఆఫ్టరాల్ అనకండి మేడం ఫ్రెండ్ షిప్ ముందు ఇవన్నీ ఉండవ్...
స్వప్న: నువ్వేంట్రా దీన్ని తీసుకుని గుడికొచ్చావ్... నేను రమ్మంటే రావు..తనతో మాత్రం వస్తావా...ఎంటే వాడు రమ్మంటే నువ్వు రావడమేనా
జ్వాల: గుడికి రావడం తప్పా
స్వప్న: మధ్యలో నువ్వుండు...
జ్వాల: హలో మేడం నువ్వు తప్ప మీ ఫ్యామిలీలో అందరూ నా ఫ్రెండ్సే...
స్వప్న: బయటకు అమాయకంగా కనిపిస్తావ్ కానీ చాలా ప్లాన్స్ ఉన్నట్టున్నాయ్...


Also Read: తండ్రి కార్తీక్ ని మోనిత మోసం చేసిందని తెలుసుకున్న హిమ,శౌర్య- తమ్ముడు ఆనంద్ పై ఒకరికి ప్రేమ మరొకరికి పగ
అరుస్తున్న తల్లిని ప్రేమ్ అక్కడినుంచి లాక్కెళ్లిపోతాడు... అయినా హిమ నిరుపమ్ తో గుడికిరావడం ఏంటి...కొంపతీసి హిమ-నిరుపమ్ ని ఇష్టపడుతోందా అనుకుంటాడు. మరోవైపు ఇంట్లో కూర్చున్న హిమ... గుడిలో స్వప్న అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. నువ్వేమన్నావని స్వప్న అత్తయ్య అంతలా ద్వేషిస్తోందని అడుగుతుంది హిమ... వద్దులే హిమ అవన్నీ చెబితే నువ్వుకూడా హర్టవుతావ్ అంటుంది సౌందర్య.  ఇంతలో డాడీ అని అరుచుకుంటూ ఎంట్రీ ఇస్తుంది స్వప్న. నేను వెళ్లి మాట్లాడి వస్తాను సౌందర్య నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి బయటకు వెళతాడు ఆనందరావు...


స్వప్న: నేను కూర్చోవడానికి మీరిచ్చే కాఫీ, టీలు తీసుకునేందుకు రాలేదు... గేమ్స్ ఆడొద్దని మీ నానమ్మకి చెప్పండి...
సౌందర్య: ఏం మాట్లాడుతున్నావ్ గేమ్స్ ఆడటం ఏంటి...
స్వప్న: నేను తనతో మాట్లాడటం లేదని చెప్పండి...నువ్వేంటే ఎదురుగా వచ్చి నిల్చున్నావ్ అవతలకి పో ....నీ మొహం చూస్తేనే నా తమ్ముడి చావు గుర్తుస్తుంది ...
సౌందర్య: నోటికి ఎంతొస్తే అంత అనడమేనా...ఓ మంచి మర్యాద తెలియదా...
స్వప్న: మంచి, మర్యాద గురించి మీ ఆవిడని మాట్లాడొద్దని చెప్పండి...
ఆనందరావు: తల్లితో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా..
స్వప్న: నాకు అమ్మలేదు..మీరొక్కరే ఉన్నారు...


ఎపిసోడ్ ముగిసింది....