కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 2 శనివారం ఎపిసోడ్


హిమ: మోనిత వదిలెళ్లిన ఇంటికి వెళ్లిన హిమ అక్కడ తన తండ్రి కార్తీక్ ఫొటో ముందు ఏడుస్తూనే ఉంటుంది. మీరు లేని బాధ ఓవైపు-శౌర్య వెళ్లిపోయిందన్న బాధ మరోవైపు... శౌర్య కోసం వెతుకతూనే ఉన్నాం, ఎదురుచూస్తూనే ఉన్నాం అంటుంది. అసలు మోనిత ఆంటీ ఇలా చేస్తుందనుకోలేదు.. ఇద్దరి మధ్యా డాడీ ఎంత నలిగిపోయి ఉంటారో, అమ్మ ఎంత బాధపడి ఉంటుందో... ఈ లెక్కన ఆనంద్ నా సొంత తమ్ముడన్నమాట..ఎక్కడున్నావ్ ఆనంద్ అనుకుంటుంది హమ.  మరోవైపు జ్వాల కూడా ఓ కస్టమర్ ని దింపేందుకు బస్తీకి వెళ్లి అట్నుంచి అటే తాము గతంలో ఉన్న ఇంటికి వెళుతుంది. ఆ ఇంటి ముందు ఆగి చూస్తుంది.  ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయంటే ఎవరో ఈ ఇంట్లో మేల్కొనే ఉన్నారన్నమాట... ఒకవేళ వారణాసి అక్కడ ఉండిఉంటే తనకి హిమ ఆచూకీ తెలుస్తుందేమో అనుకుంటూ లోపలకు అడుగుపెడుతుంది. అప్పటికే అక్కడినుంచి హిమ వెళ్లిపోతుంది. 


Also Read: కొత్తకొత్తగా ఉన్నది, ప్రేమ రంగుల్లో తడిసిముద్దైన రిషి-వసుధార


జ్వాల: లోపలకు వెళ్లిన జ్వాల అక్కడ తండ్రి ఫొటో చూస్తుంది. అదే సమయంలో గోడపై ఉన్న మోనిత-కార్తీక్ ఫొటో చూసి షాక్ అవుతుంది. ఇదేంటి మోనిత ఆంటీ-నాన్న ఫొటో ఉందేంటి, అంటే ఇది మోనిత ఆంటీ ఇల్లా అనుకుంటూ...అదే సమయంలో ఆనంద్ ని మోనిత ఎత్తుకున్న ఫొటో చూసి అంటే ఆనంద్ మోనిత ఆంటీ కొడుకా అనుకుంటుంది. అప్పట్లో మోనిత తమ చేతిలోంచి బాబుని లాక్కునేందుకు ప్రయత్నించిన సంఘటన గుర్తుచేసుకుంటుంది. అంటే ఆనంద్ నాన్న కొడుకా..నిజంగా నా తమ్ముడా ..మోనిత ఆంటీ నాన్నని మోసం చేసి ఉంటుంది, చాలాసార్లు కన్నింగ్ గా మాట్లాడేది, మోనిత ఆంటీ అమ్మని మోసం చేసిందా-అమ్మ ఎంత బాధపడి ఉంటుందో మొదట్నుంచీ అమ్మ జీవితంలో అన్నీ కష్టాలే....ఆనంద్ నాకు తమ్ముడన్నమాట. మా అమ్మని మోసం చేసిన ఆ మోనిత ఆంటీ కొడుకు నాకు తమ్ముడే కదా...( తమ్ముడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారమ్మా అని సౌందర్య చెప్పిన మాట గుర్తుచేసుకుంటుంది). ఇప్పటి వరకూ అక్కా చెల్లి అనుబంధమే నాకు నచ్చనిది, ఈ రోజునుంచి అక్కా-తమ్ముళ్ల బంధం కూడా నాకు నచ్చదు. 


నాన్న ఫొటో ముందు దీపాలు వెలుగుతున్నాయంటే ఇంట్లో ఎవరో ఉన్నారన్నమాట అనుకుంటూ లోపల ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంది జ్వాల. ఇంతలో మెట్లపైనుంచి ఓ ముసలావిడ దిగివస్తుంది. ఎవరమ్మా నువ్వు అంటే..అసలు నువ్వెవరు...ఈ ఇంట్లో నీకేం పని అని అడుగుతుంది జ్వాల. ఇంట్లో ఎవ్వరూ ఉండరని చెప్పిన ఓ ముసలామె....ఈ ఇంటి గురించి కథలు కథలుగా చెబుతారు...ఎరో వస్తారు ఏవేవో మాటలు వినిపిస్తాయని అంటుంది. అప్పుడప్పుడు నీ ఈడు అమ్మాయి వచ్చి దీపం వెలిగించి, ఏడ్చి వెళ్లిపోతుంది..నాక్కొంచెం డబ్బులు కూడా ఇస్తుంది.... అంటే హిమ వచ్చి ఉంటుంది...అంటే హిమ ఇదే ఊర్లో ఉందా లేదా వచ్చి వెళుతుంటుందా అని జ్వాల ఆలోచిస్తుండంగా ...ఇప్పుడే వెళ్లింది ఆ దీపం ఇప్పుడే వెలిగించిందని చెప్పడంతో బయటకు పరుగుతీస్తుంది. రోడ్డుపై నిల్చుని హిమా అని అరిచిన శౌర్య..నిన్ను వదిలేదే లేదు అంటుంది.


సౌందర్య ఇంట్లో: అదిగో హిమ వచ్చింది పదండి భోజనం చేద్దాం అంటే...నేను బయట  తినివచ్చానని చెప్పి గుడ్ నైట్ చెప్పేసి వెళ్లిపోతుంది హిమ. ఎక్కడికి వెళ్లిందో ఏంటో దీని వాళకం చూస్తుంటే భయం వేస్తోందండీ అంటుంది సౌందర్య. 
స్వప్న ఇంట్లో: స్వప్న ఇంటికి వెళ్లిన ప్రేమ్...ఎందుకు ఇంత అర్జెంట్ గా రమ్మన్నావ్ అంటే...గుడికి వెళ్లేందుకు రమ్మన్నానంటుంది. బిజినెస్ టూర్స్ ఒక్కదానివే తిరిగేస్తావ్ కదా పక్కనున్న గుడికి వెళ్లేందుకు నన్ను పిలవడం అవసరమా అంటాడు. నేను పిలిస్తే చిరాకుపడుతున్నావ్ ఏంటి ప్రేమ్..నాపై ప్రేమ తగ్గిపోతోంది అంటుంది. నన్ను గుడికి వెళ్లడానికే రమ్మన్నావా ఇంకేదైనా కారణం ఉందా అని ప్రేమ్ అడిగితే పద చెబుతా అని లాక్కెళ్లిపోతుంది. గుడికి కాదు కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నట్టుందంటాడు ప్రేమ్. 


Also Read: మోనిత కొడుకు ఆనంద్ ఎంట్రీకి టైమొచ్చిందా, హిమ మాటలు విన్న శౌర్య ఏం చేయబోతోంది


మరోవైపు సౌందర్య హిమకి చీర కట్టి పూలుపెట్టి రెడీ చేస్తుంది. 
ఆనందరావు: ఏంటి సౌందర్య మనవరాలిని పెళ్లికూతురిలా ముస్తాబుచేసి మురిసిపోతున్నావ్
హిమ: ఏంటి తాతయ్య ఇదేం పోలిక..తల్లో పూలుపెడితే పెళ్లికూతురు అంటారా
సౌందర్య: ఏంటండీ పెళ్లి టాపిక్ ఎత్తితే హిమకి నచ్చదు కదా..అందుకే ఎప్పుడు పెళ్లిచేసుకుంటావ్ అని నేను అడగలేదు...
హిమ: అడగను అంటూనే అడిగేశావ్ కదా...
సౌందర్య: ఈ రోజు మంచి రోజు..గుడికి వెళ్లు నీకు మంచి మొగుడొస్తాడు...
హిమ: శౌర్య కనిపించేవరకూ నేను అసలు పెళ్లేచేసుకోను...తనని కనిపెట్టడమే నా లక్ష్యం...నాకు శౌర్య కనిపించాలి తనే నాకు ముఖ్యం...నేను చేసిన తప్పువల్ల శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోయింది...తనని కలవాలి, నా తప్పుని క్షమించమని అడగాలి, నా వల్లే కదా అమ్మా-నాన్న అలా అయ్యారు...శౌర్య దొరికేవరకూ పెళ్లి ప్రస్తావన వద్దని స్పష్టంగా చెబుతుంది హిమ. శౌర్య దొరక్కపోతే అశలు పెళ్లిచేసుకోను... పెళ్లి, పెళ్లి అంటూ మళ్లీ నా ప్రాణం తీయకండి....


ఎపిసోడ్ ముగిసింది...