'నట రత్నాలు' ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ కథానాయకుడు, నటుడు సుమన్ (Suman Actor) మీద దర్శకుడు శివ నాగు (Director Shiva Nagu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీ రిలీజ్ వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానిస్తే రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని సంచనల ఆరోపణలు చేశారు. అయితే... ఇప్పుడు ఆయన స్వరం మారింది. ఆ రోజు ఏదో అలా మాట్లాడేశానని చెబుతున్నారు. అసలు, ఆయన ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే... 


సుదర్శన్‌, రంగస్థలం మహేశ్‌ (Rangasthalam Mahesh), 'తాగుబోతు' రమేష్ (Thagubothu Ramesh) ప్రధాన పాత్రధారులుగా శివ నాగు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'నట రత్నాలు'. ఈ చిత్రంలో ఇనయా సుల్తాన (Inaya Sultana) కథానాయికగా నటించారు. ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డా. దివ్య నిర్మించారు. ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్, హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ ఫంక్షన్ అటెండ్ కావడం కోసం సుమన్ రెండు లక్షలు అడిగారని శివ నాగు మండిపడ్డారు. 


పది రోజులు సాగదీసి డబ్బులు అడిగారు!  - శివనాగు
'సుమన్ హీరోగా నేను మూడు సినిమాలు తీశా. ఆయనను 'నట రత్నాలు' ప్రీ రిలీజ్ వేడుకకు రమ్మని ఆహ్వానించా. ఫోన్‌ చేసినప్పుడు అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. ఆ తర్వాత పది రోజులు సాగదీసి సాగదీసి, తర్వాత ఆయన మేకప్‌మెన్‌ ఫోన్‌ లిఫ్ట్ చేశారు. 'రెండు లక్షలు ఇస్తే సుమన్ గారు ఫంక్షన్‌కి వస్తారట' అన్నారు. ఆయన ఆడియో రిలీజ్‌ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బులు ఇచ్చి ఆయన్ను పొగడాలా? సుమన్‌ గారి తీరు చూశాక నాకు బాధ కలిగింది. ఇప్పుడు చిన్న సినిమాలకు ఎవరూ సహాయ సహకారాలు అందించడం లేదు'' అని సుమన్ మీద శివనాగు మండిపడ్డారు. కట్ చేస్తే... ఇప్పుడు సారీ చెప్పారు. 


సారీ సుమన్... ఏదో అలా మాట్లాడేశా!
Suman Vs Shiva Nagu : సుమన్‌ తన కుటుంబానికి ఎంతో కావల్సిన వ్యక్తి అని శివ నాగు తెలిపారు. తన పిల్లలు నిర్మిస్తున్న 'నట రత్నాలు' ప్రీ రిలీజ్ వేడుకలో ఆయనకు సన్మానం చేయాలని భావించామన్నారు. ''ఆయన్ను (సుమన్)ను ఆహ్వానించే క్రమంలో మేకప్‌ మెన్‌ వెంకట్రావు చెప్పడం సమస్యో? తాను వినడం పొరపాటో? తెలీదు కానీ ఫంక్షన్‌ ఒత్తిడిలో సుమన్‌ గారిపై ఆరోపణలు చేశా. ఆ తర్వాత చాలా మంది నిర్మాతలు నాకు ఫోన్‌ చేశారు. అప్పుడు నేను పొరపాటుగా మాట్లాడానని అర్థమైంది. సుమన్‌ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా'' అని శివ నాగు ఓ లేఖ విడుదల చేశారు. 


Also Read : మీనాక్షి, ఫరియా, సంయుక్త - 'గుంటూరు కారం' హీరోయిన్ రేసులో ముగ్గురు?



అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యనారాయణ, సూర్య కిరణ్, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ సాల్మన్, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : గిరి కుమార్, సాహిత్యం : సీతారామ చౌదరి, కూర్పు : ఆవుల వెంకటేష్, సంగీతం : శంకర్ మహాదేవ్, నిర్మాతలు : డా దివ్య, వై. చంటి, ఆనంద్ దాస్ శ్రీ మణికంఠ. 


Also Read : నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?