Nag Ashwin: 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి' చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇప్పుడు లేటెస్టుగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ఎపిక్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. గత గురువారం థియేటర్లలోకి వచ్చి, వరల్డ్ వైడ్ గా ఇప్పటికే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నాగ్‌ అశ్విన్‌ తాజాగా కల్కి సెట్ లో మీడియా మీట్ నిర్వహించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. 


మైథాలజీని సైన్స్ ను ముడిపెడుతూ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని రూపొందించారు. హీరో ప్రభాస్ కాబట్టి ఆయనే కల్కిగా కనిపిస్తారని అందరూ భావించారు. కానీ సినిమాలో ప్రభాస్ ను బౌంటీ హంటర్ భైరవగా చూపించి, క్లైమాక్స్ లో కర్ణుడిగా ప్రెజెంట్ చేసారు. దీంతో కల్కిగా ఏ హీరో కనిపిస్తారని అందరూ ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని నాగ్ అశ్విన్ ను అడగ్గా.. ''కల్కి ఇంకా కడుపులోనే ఉన్నారు. అప్పుడే క్యాస్టింగ్ వరకూ వెళ్ళలేదు. దానికి ఇంకా చాలా టైం ఉంది'' అని సమాధానమిచ్చారు. 


'కల్కి' సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అంతేకాదు దీంట్లో బోలెడన్ని అతిథి పాత్రలున్నాయి. ఎస్.ఎస్ రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్ లాంటి కొందరు క్యామియో రోల్స్ చేసారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తొలిసారిగా బిగ్ స్క్రీన్ మీద కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసారు. అయితే ఆర్జీవీని ఎలా ఒప్పించారు? పార్ట్- 2లో ఆయన ఉంటారా? అని అడిగితే.. ఇప్పుడే చెప్పలేమని నాగ్ అశ్విన్ అన్నారు. 


''కల్కి పార్ట్-2లో ఆర్జీవీ ఉంటారో లేదో తెలియదు. ఆయనకు, రాజమౌళికి ఇది ట్రిబ్యూట్. ఫిలిం ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన అలాంటి దర్శకులు నా సినిమాలో ఉంటే మరింత గొప్పగా ఉంటుందని అనుకున్నాను. ఆర్జీవీ ఇంతకముందు ఎప్పుడూ యాక్ట్ చెయ్యలేదు. 'అసలు నీ సినిమాలో నేను ఎందుకు ఉండాలి?' అని ఆయన నన్ను అడిగారు. 'కలియుగంలో మీరు ఉంటారనిపిస్తోంది. అందుకే సార్' అన్నాను. వెంటనే ఆయన షూటింగ్ కు వస్తానని చెప్పారు'' అని నాగ్ అశ్విన్ తెలిపారు. 



విజయ్‌ దేవరకొండ, మాళవిక నాయర్‌లను తాను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోకి తీసుకోవడం గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ తనకు లక్కీ ఛార్మ్స్ అనుకోవచ్చని నాగి చెప్పారు. ''ఫస్ట్ మూవీ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. వాళ్ళిద్దరితో కలిసి పనిచేయడం నాకు కంఫర్ట్‌గా ఉంటుంది'' అని అన్నారు. తన గత చిత్రాల్లో నటించిన నాని, నవీన్‌ పొలిశెట్టిని ఎందుకు తీసుకోలేదని అడగ్గా.. పార్ట్‌-1లో వాళ్ళను తీసుకునే అవకాశం దొరకలేదని, కానీ తర్వాత ఎక్కడ వీలుంటే అక్కడ వారిని పెట్టేస్తానని బదులిచ్చారు. ‘కల్కి 2898 AD’ లో దుల్కర్ సల్మాన్ క్యారక్టర్, కైరా బ్యాక్ స్టోరీలతో సపరేట్ గా సినిమాలు తీయొచ్చని నాగ్ అశ్విన్ అన్నారు. 



Also Read: నందమూరి కల్యాణ్ రామ్ ఎంతమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారో తెలుసా?