Nag Ashwin: ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు? అసలు విషయం చెప్పేసిన నాగ్ అశ్విన్

Nag Ashwin: మహేశ్ బాబును శ్రీకృష్ణుడి పాత్రలో చూడాలని తన ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే ‘కల్కి’ సీక్వెల్‌లో తనను ఆ రోల్‌లో చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు.

Continues below advertisement

Nag Ashwin: సినిమా విడుదలయ్యి వారం రోజులు అయినా.. ఇంకా ప్రేక్షకులు ‘కల్కి 2898 AD’ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీని చూడడానికి మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చే తరువాతి చిత్రాలపై అప్పుడే అంచనాలను భారీగా పెంచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘కల్కి 2898 AD’లో అంతమంది స్టార్ యాక్టర్లు ఉన్నా.. వారందరినీ నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేసిన తీరు బాగుందని చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. తాజాగా కల్కి తరువాతి భాగాల్లో కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు నటించబోతున్నారా అనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు.

Continues below advertisement

కృష్ణుడిగా మహేశ్.?

మహాభారతంలోని క్యారెక్టర్లను రిఫరెన్స్‌గా తీసుకొని ‘కల్కి 2898 AD’ను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో ఆ పాత్రలను జోడించిన తీరు బాగుందని చాలామంది ప్రేక్షకులు తనను ప్రశంసించారు. ఇక మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల్లో కనిపించడం కోసం స్టార్ యాక్టర్లను రంగంలోకి దించాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రల గురించి ముందే రివీల్ చేయగా.. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు గెస్ట్ రోల్స్‌లో కనిపించి అలరించారు. కానీ మహాభారతంలో ముఖ్యమైన పాత్ర అయిన శ్రీకృష్ణుడి గురించి మాత్రం ‘కల్కి 2898 AD’లో చూపించలేదు నాగ్ అశ్విన్. దీంతో ఆ పాత్రలో మహేశ్ బాబు కనిపించనున్నాడా అనే ప్రశ్న తనకు ఎదురయ్యింది.

ఇందులో కాదు..

సూపర్ స్టార్ మహేశ్ బాబును ఎప్పటినుండో ఒక మైథలాజికల్ క్యారెక్టర్‌లో చూడాలని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ మహేశ్ మాత్రం అలాంటి కథలవైపే వెళ్లడం లేదు. అయినా కూడా మహేశ్‌ను అలాంటి క్యారెక్టర్ల ఫోటోలతో ఎడిట్ చేసుకుంటూ సంతోషిస్తున్నారు ఫ్యాన్స్. ఇక మహాభారతం రిఫరెన్స్‌తో టాలీవుడ్‌లో ‘కల్కి 2898 AD’ లాంటి మూవీ రావడంతో మహేశ్ బాబు ఈ మూవీలో నటిస్తే బాగుంటుందని, శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ అనుకోవడం మొదలుపెట్టారు. అదే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించాడు. ‘‘ఈ సినిమాలో కాదు. కచ్చితంగా వేరే సినిమాల్లో ఆయన చేస్తే బాగుంటుంది’’ అని అన్నాడు.

మరికొందరు యాక్టర్స్..

నాగ్ అశ్విన్ మాటలను బట్టి చూస్తే కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో అసలు మహేశ్ బాబు ఉండడని స్పష్టమవుతుంది. అయినా తన సినిమాలో కాదని, వేరే సినిమాల్లో మహేశ్ బాబు అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందని నాగ్ అశ్విన్ అనడం వెనుక అర్థమేంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ సినిమా కోసం ఎంతోమంది స్టార్లను రంగంలోకి దించిన ఈ యంగ్ డైరెక్టర్.. తరువాతి భాగాల్లో వారితోనే కథను నడిపిస్తాడేమో అని అంచనా వేస్తున్నారు. కానీ కల్కి యూనివర్శ్‌లో మరికొందరు కొత్త నటులు యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.

Also Read: పూర్తి కథ తెలియకుండా ఎవరినీ జడ్జ్ చేయకండి - వెంకీ మామకు ఏమైంది? అలాంటి పోస్ట్ పెట్టారు?

Continues below advertisement
Sponsored Links by Taboola