Daaku Maharaaj : నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై రీసెంట్ గా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మూవీ డిజిటల్ ప్రీమియర్ కు ముందే నెట్ ఫ్లిక్స్ సినిమాలో నుంచి ఊర్వశి రౌతేలా సీన్స్ ను తొలగించిందని వార్తలు రావడం వివాదానికి దారి తీసింది. కానీ అవన్నీ పూర్తిగా ఫేక్ వార్తలని తాజాగా స్పష్టమైంది.
ఊర్వశి సీన్స్ డిలీట్ వార్తలన్నీ అవాస్తవం
'డాకు మహారాజ్' మూవీ ఓటిటి స్ట్రీమింగ్ గురించి ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుక జనవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లను కొల్లగొట్టింది. మరికొన్ని గంటల్లో మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అన్న టైంలో, ప్రమోషన్లలో భాగంగా నెట్ ఫ్లిక్స్ కొన్ని పోస్టర్లను రిలీజ్ చేసింది. అవే వివాదానికి కారణమయ్యాయి. ఎందుకంటే అందులో ఇక ఈ మూవీలో నటించిన మెయిన లీడ్స్ బాలకృష్ణతో పాటు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ వంటి ప్రధాన తారాగణం ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసింది. కానీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని సన్నివేశాల్లో మెరిసిన ఊర్వశీ రౌతెల పోస్టర్లలో మిస్ అయ్యింది.
దీంతో ఒక్కసారిగా ఓటీటీ వెర్షన్ నుంచి ఊర్వశి సీన్స్ ను డిలీట్ చేశారనే ఊహగానాలు మొదలయ్యాయి. అయితే ఆ మిస్టేక్ ను గమనించిన నెట్ ఫ్లిక్స్ తర్వాత సపరేట్ గా మళ్లీ పోస్టర్లను రిలీజ్ చేసి, తప్పును సరిదిద్దుకుంది. కానీ ఊర్వశి సీన్స్ ను సినిమా నుంచి డిలీట్ చేశారు అని రూమర్లు మాత్రం ఆగలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలన్నీ ఫేక్ అని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సినిమాలో నుంచి ఒక్క సీన్ ని కూడా డిలీట్ చేయలేదు. థియేట్రికల్ రన్ లో ఎంత టైమ్ ఉందో, ఓటీటీలో కూడా మూవీని అదే రన్ టైమ్ తో రిలీజ్ చేయబోతున్నారు. అసలు డిజిటల్ వర్షన్ కోసం ఎలాంటి ఎడిటింగ్ చేయలేదని సమాచారం.
ఇక సినిమాలో ఊర్వశి రౌతేలా సీన్లను డిలీట్ చేశారని రూమర్లు రావడానికి కారణం గతంలో జరిగిన కొన్ని వివాదాలే. ఈ సినిమా రిలీజ్ కి ముందు 'దబిడి దిబిడి' సాంగ్ లో బాలయ్య - ఊర్వశి రోతల వేసిన స్టెప్పులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి పై స్పందిస్తూ ఊర్వశి చేసిన కామెంట్స్ మరో వివాదానికి దారి తీసాయి. అలాగే కియారా అద్వానీ నటించిన పాన్ ఇండియా మూవీ డిజాస్టర్ అయిందని, కానీ తాను చేసిన 'డాకు మహారాజ్' మాత్రం 100 కోట్ల క్లబ్లో చేరింది అంటూ ఊర్వశి ఇచ్చిన మరో స్టేట్మెంట్ కూడా ట్రోలింగ్ కు దారి తీసింది.
'డాకు మహారాజ్' ఓటీటీ స్ట్రీమింగ్
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగులో థియేటర్లలోకి వచ్చిన 'డాకు మహారాజ్' మూవీ... ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. బాబి కొల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో బాలకృష్ణ, బాబి డియోల్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.