Actor Mohanlal Confirmed 'Drishyam 3': క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఆ జానర్‌లోనే వచ్చి మంచి విజయాన్ని అందుకుంది దృశ్యం (Drishyam). 2013లో జీతూజోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అంతేకాకుండా ఇతర భాషల్లోనూ రీమేక్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు రీమేక్‌లో విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించి అలరించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'దృశ్యం 2' వచ్చింది. అయితే, కరోనా కారణంగా నేరుగా ఓటీటీలోకి విడుదలైనా మంచి విజయాన్నే అందుకుంది. మోహన్ లాల్ నటన, జీతూ జోసెఫ్ టేకింగ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే ఆ కథను కొనసాగిస్తూ 'దృశ్యం 3' కూడా ఉంటుందని దర్శకుడు జీతూ జోసెఫ్ పలు వేదికలపై ఇప్పటికే ప్రకటిస్తూనే.. సినిమా పట్టాలెక్కడానికి 3 నుంచి నాలుగేళ్లు పడుతుందని అన్నారు.


'గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు'


అప్పటి నుంచి 'దృశ్యం 3'పై (Drishyam 3) అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా నటుడు మోహన్‌లాల్ 'దృశ్యం 3'పై సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. దృశ్యం 3 పూర్తి స్క్రిప్ట్ రెడీ అయినట్లు తెలుస్తుండగా.. 'గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. 'దృశ్యం 3' రాబోతోంది.' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. దీంతో ప్రేక్షకుల్లో 'దృశ్యం 3' ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. 






Also Read: విమానంలో మెగాస్టార్ చిరంజీవి పెళ్లి రోజు వేడుక - అక్కినేని ఫ్యామిలీతో కలిసి ఎంత సింపుల్‌గా చేసుకున్నారో?.. ఫోటోలు చూశారా!


'దృశ్యం' కథేంటంటే..?


భార్య, భర్త, ఇద్దరు పిల్లలతో పల్లెటూరిలో సాఫీగా జీవితం సాగిపోయే కుటుంబం. ఆ కుటుంబంలో పెద్ద కుమార్తె ఓ టూర్‌కు వెళ్లగా ఓ పోలీస్ ఆఫీసర్ కుమారుడు వరుణ్ సీక్రెట్‌గా వీడియో తీస్తాడు. ఈ క్రమంలోనే అతన్ని ఈ ఫ్యామిలీ హత్య చేస్తుంది. ఆ కేసు నుంచి తన కుటుంబాన్ని బయటపడేసేందుకు ఆ కుటుంబ పెద్ద ఏం చేశాడు. కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పని చేసే అతను.. ఎలా దీని నుంచి బయటపడ్డాడు.? అనేదే కథాంశంగా 'దృశ్యం' ఉంటుంది. అయితే, వరుణ్ హత్య కేసు తమను ఎప్పటికైనా వెంటాడుతుందన్న భయం మాత్రం ఆ కుటుంబ పెద్దలో ఉంటుంది. ఈ క్రమంలోనే కేసు రీఓపెన్ కాగా.. తన తెలివితేటలతో మళ్లీ కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. పోలీసులు ఎంత వెతికినా చిన్న ఆధారం కూడా చిక్కకుండా జాగ్రత్తపడతాడు.


'దృశ్యం 2'లో కేసు రీ ఓపెన్ అయిన నాటి నుంచి జరిగిన పరిణామాలను చూపించగా.. క్రైమాక్స్‌లో కుటుంబ పెద్ద.. ఆ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి ఓ లేఖ పంపుతాడు. 'మీరు అడిగింది మీకు ఇస్తున్నా. మళ్లీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి.' అని లేఖలో పేర్కొంటాడు. మరి 'దృశ్యం 3'లో ఈ కేసు ముగిస్తారా.? కొనసాగుతుందా.? అనేది ఆసక్తికరంగా ఉండనుంది.


Also Read: మరో థ్రిల్లింగ్‌కు సిద్ధమేనా - నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ అప్ డేట్ వచ్చేసింది, టీజర్ ఎప్పుడంటే?