Vishwak Sen's Statement About Laila Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) లేటెస్ట్ మూవీ 'లైలా' (Laila Movie) బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుస పరాజయాలపై నటుడు విశ్వక్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. ఇక నుంచి ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీస్తానని.. క్లాస్ అయినా మాస్ అయినా అసభ్యత అనేది ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల తన సినిమాలు ఆశించినంత స్థాయిలో ఆడలేదని అన్నారు. 'ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మ విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన నా అభిమానులు, నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ, ఆ ప్రయత్నంలో నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నా.
ఇకపై నా ప్రతి సినిమా క్లాస్, మాస్ ఏదైనా సరే అసభ్యతకు చోటుండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు మీకు పూర్తిగా ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది ప్రేక్షకులే. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే, నా కథానాయకులు, దర్శకులు, రచయితలు, నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో మీ ముందుకొస్తాను. నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం.' అని లేఖలో విశ్వక్ సేన్ పేర్కొన్నారు.
సరైన్ హిట్ కోసం..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్షశర్మ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా' ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపించగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. సాహు గారపాటి నిర్మించారు. విడుదలకు ముందే నటుడు 30 ఇయర్స్ పృథ్వీ వ్యాఖ్యలతో పొలిటికల్ వివాదంలో చిక్కుకుంది. విశ్వక్ ఖాతాలో ఇటీవల కాలంలో సరైన హిట్ పడలేదు. 'లైలా' ముందు మూవీ 'మెకానిక్ రాకీ' పర్వాలేదనిపించినా, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం విశ్వక్.. జాతిరత్నాలు పేం అనుదీప్ కె.వితోతో ఫంకీ (Funky)లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఫార్చ్యూన్ పోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి రూపొందిస్తున్నాయి.
Also Read: 'శివంగి'గా ఆనంది ఫస్ట్ లుక్ - లుంగీ కట్టుకుని నుదిటిపై విభూతితో డిఫరెంట్‌గా పవర్ ఫుల్ లేడీ