Natural Star Nani's HIT 3 Movie Teaser Release Date: నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'హిట్ 3' (HIT 3). సైకో బ్యాక్ డ్రాప్‌లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన హిట్, హిట్ 2 మూవీస్ మంచి హిట్ అందుకున్నాయి. హిట్ ఫ్రాంచైజీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నాని భిన్నంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 'హిట్ 3' షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా.. టీజర్ విడుదలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వారి సస్పెన్స్‌కు మేకర్స్ తెరదించారు. నాని బర్త్ డే సందర్భంగా ఈ నెల 24న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.






'హిట్' సక్సెస్ కొనసాగేలా..


గతంలో 'హిట్' సిరీస్‌లో వచ్చిన 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'హిట్'లో నటించగా.. 'హిట్ 2'లో అడవి శేష్ నటించి మెప్పించారు. హిట్ ఫ్రాంచైజీలో ఒక్కో కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆసక్తికరంగా కథను నడిపించారు. ఈ క్రమంలో హిట్ 2 సినిమా క్లైమాక్స్‌లోనే 'హిట్ 3' మూవీని నాని చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉండనున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన ఓ వీడియో తేలిపోయింది. తొలి 2 సిరీస్‌ల్లో ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్వెస్టిగేషన్ జరగ్గా.. హిట్ 3 కేసు ఇన్వెస్టిగేషన్ దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. హీరో నాని విభిన్నంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తొలి 2 సినిమాల్లోనూ ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హిట్ 2 క్లైమాక్స్‌లోనే నాని రోల్‌కు సంబంధించి దర్శకుడు భారీ ఎలివేషన్ ఇచ్చారు. ఎప్పుడూ కోపంతో ఉండే ఎవరు చెప్పినా వినని ఓ పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆయన్ను చూపించనున్నారు. 


Also Read: మూవీ లవర్స్‌కు పండగే - ఒకే రోజు 'ఈటీవీ విన్'లో 16 సినిమాలు, అప్పటి హిట్స్ కూడా.. చూసి ఎంజాయ్ చేసెయ్యండి!


ఆ రూమర్ నిజమేనా..


అయితే, 'హిట్ 3'కు సంబంధించి ఓ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రెండు కీలక గెస్ట్ రోల్స్ ఉన్నాయని గాసిప్ వినిపిస్తోంది. మునుపటి సిరీస్‌ల్లో హీరోలైన విశ్వక్, అడవి శేష్.. 'హిట్ 3'లోనూ కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఒకవేళ ఇదే నిజమైతే ముగ్గురు స్టార్ హీరోలు ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో అభిమానులకు సూపర్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. 'సరిపోదా శనివారం' తర్వాత 'హిట్ 3' కాకుండా.. నాని యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' చేస్తున్నారు. ఆయనతో 'దసరా' తీసి హిట్టు కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 


Also Read: 'నన్ను విమర్శించే హక్కు మీకు పూర్తిగా ఉంది' - ఇక నుంచి అసభ్యత లేకుండా సినిమాలు చేస్తా.. ఇట్లు మీ విశ్వక్ సేన్