Ileana D’Cruz: ఇలియానా.. ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన పేరు అది. ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండకపోవచ్చు. అంతలా తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుందీ బ్యూటీ. ఇలియానా గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. ఇటీవలే ఆమె గర్భవతి కూడా అయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఇప్పటి వరకూ తన బాయ్ ఫ్రెండ్ ఎవరి అనేది వెల్లడించలేదు. తాజాగా తన ప్రియుడి ఫోటోలను రివీల్ చేసింది. ‘డేట్ నైట్ విత్ లవ్’ అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన ప్రియుడ్ని పరిచయం చేసిందీ గోవా బ్యూటీ. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇలియానా బాయ్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ తమ్ముడా?
ఇలియానా డేటింగ్ లో ఉంది అని తెలిసినప్పటి నుంచీ ఆమె లవర్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. ఇలియానా కూడా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసినా అందులో అతని ఫేస్ కనబడకుండా చేసేది. దీంతో అతను ఎవరు అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవవా అబ్బాయి అంటూ ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్. అయితే అతను మరెవరో కాదు ప్రముఖ నటి కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ అని వార్తలు వస్తున్నాయి. ఇలియానా సెబాస్టియన్ తోనే లవ్ లో ఉందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఎందుకంటే గతంలో కత్రినా కైఫ్ పుట్టిన రోజు వేడుకల్లో సెబాస్టియన్ తో పాటు ఇలియానా కూడా పాల్గొంది. దీంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే, ఇందులో వాస్తవం ఏమిటనేది తెలియాల్సి ఉంది. అలాగే, ఆ పిక్‌లో ఉన్న వ్యక్తి కత్రినా తమ్ముడు సెబాస్టియనా కదా అనేది కూడా నిర్ధరించాల్సి ఉంది. అయితే, నెటిజన్స్ మాత్రం తమకు తాము కథలు అల్లేసుకుంటున్నారు.
ఎవరీ సెబాస్టియన్?
సెబాస్టియన్ కత్రినా కైఫ్ తమ్ముడు. అతను ఫర్నిచర్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిన బ్రిటిష్ మోడల్. ఆయన బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీ నుండి ఫర్నిచర్ డిజైన్, క్రాఫ్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాడు. మోడలింగ్‌తో పాటు, అతను ఫర్నిచర్ డిజైనింగ్ లో కూడా రానిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం లండన్ కు చెందిన "డాండీ డైనింగ్ లిమిటెడ్" అనే కంపెనీలో డైరెక్టర్‌గా చేరాడు. సెబాస్టియన్ క్రమం తప్పకుండా భారతదేశాన్ని సందర్శిస్తూ ఉంటాడు. తమిళనాడులో ఉన్న తన తల్లి పేరు మీద ఉన్న పాఠశాలలో పేద విద్యార్థులకు సహాయం కూడా అందిస్తుంటాడు. అయితే, ఇలియానాతో ఉన్నవ్యక్తి, సెబాస్టియన్ ఒక్కరేనా అనేది తేలాల్సి ఉంది.
ఇక ఇలియానా ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మహేష్ బాబుతో ‘పోకిరి’ లో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత వరుసగా ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసిందీ గోవా బ్యూటీ. తెలుగులో చివరిగా రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించింది. ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది. మరి కొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె బాయ్ ఫ్రెండ్ అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మరి తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలియానా పూర్తిగా ఎప్పుడు వెల్లడిస్తుందో చూడాలి.
Also Read: ‘గులాబీ’ కథను రాజశేఖర్‌కు చెప్పారు, ఆ కారణంతో నన్నుహీరోను చేశారు: జేడీ చక్రవర్తి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial