ప్రభాస్ చేతిలో ఉన్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ‘ప్రాజెక్ట్ కే’. ఈ సినిమా ప్రచారాన్ని నిర్మాతలు ప్రారంభించారు. సినిమా నుంచి దీపికా పడుకోనే లుక్‌ను రివీల్ చేశారు. నిజానికి సాయంత్రం ఐదు గంటలకే రివీల్ చేస్తామని ప్రకటించినా, చాలా ఆలస్యంగా రాత్రి 10 గంటల పైన విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్‌లో దీపికా లుక్ మాత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఉంది.


రానున్న మూడు రోజుల్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌ల ఫస్ట్ లుక్‌లు కూడా నిర్మాతలు విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 






మరోవైపు ‘ప్రాజెక్ట్-K’ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ నెల (జులై) 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. అక్కడే జులై 20న ప్రాజెక్ట్‌ గా టైటిల్‌తోపాటు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ కూడా పాల్గొంటారు. ఈ మేరకు చిత్రబృందం ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేసింది. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. రీసెంట్ గా ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీకి సంబంధించి టీజర్ విడుదల కాగా, ఇప్పుడు  ‘ప్రాజెక్ట్-కె’ గ్లింప్స్ కూడా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.  


'ప్రాజెక్ట్ కె'లో కె... అంటే 'కాలచక్రం' (KaalChakra) అని జోరుగా హుషారుగా ప్రచారం జరుగుతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కనుక ఆ టైటిల్ అయితే బావుంటుందని ఫిక్స్ అయ్యారట. కాలంలో వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం వంటి అంశాల నేపథ్యంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా రూపొందుతోంది. కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. మరి, ఈ కాలచక్రం చేసే మాయ ఏమిటో? వెండితెరపై చూడాలి. సృష్టిలో విధ్వంస శక్తులను కథానాయకుడు ఎదుర్కోవడంలో కాలచక్రం పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కె అంటే కాలచక్రమా? కదా? అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.