తమిళ హీరో ధనుష్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో కొట్టివేసిన కేసు మళ్లీ ధనుష్‌ను చుట్టుకుంది. మంగళవారం ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. 


ఏం జరిగింది?: 2016లో ధనుష్ తమ కొడుకేనంటూ గతంలో ఓ వృద్ధ జంట కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, తాను వారి తల్లిదండ్రులు కాదని, తాను నిర్మాత కస్తూరి రాజా, విజయలక్ష్మిల కుమారుడునని ధనుష్ వాదించాడు. ఈ నేపథ్యంలో కోర్టు ధనుష్‌కు డీఎన్ఏ పరీక్షలు చేయాలని ముదరై జిల్లాలోని మేలూరు మెజిస్ట్రేట్ కోర్టు సూచించారు. దీనిపై ధనుష్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ధనుష్ తమ మూడో కొడుకని చెబుతూ.. అతడికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లు, 10వ తరగతి సర్టిఫికెట్ తదితర ఆధారాలను వారు సమర్పించారు. ధనుష్ కోర్టులో సమర్పించిన బర్త్ సర్టిఫికెట్‌ నకిలీదని ఆరోపించారు. ధనుష్ సినిమాల్లో అవకాశాల కోసం చిన్నప్పుడే ఇల్లు వదిలి వచ్చేశాడని తెలిపారు.  


Also Read: హైదరాబాద్‌లో షూటింగ్స్ వద్దు, హీరో అజీత్‌పై రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు

దీంతో కోర్టు ఐడెంటిఫికేషన్‌ ప్రూఫ్స్‌ సరిపోల్చడం కోసం ధనుష్‌కు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఆ ఫలితాలు ధనుష్‌కు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఆ వృద్ధ చేసిన ఆరోపణలు నిజం కాదని, ఇందుకు తగిన సాక్ష్యాధారాలు లేవంటూ 2020లో కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఈ కేసును సవాలు చేస్తూ ఆ దంపతులు తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ధనుష్‌కు సమన్లు జారీ చేసింది. మరి, ఈ సారి కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశిస్తే.. తప్పకుండా అంగీకరించాల్సి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇది ఆయన హక్కులకు భంగం కలిగించే విషయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ కేసు మళ్లీ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 


Also Read: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ గొడవపై ఆర్జీవీ ట్వీట్, ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటీ?