‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పబ్లిసిటీ కోసం హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ ప్రాంక్ వీడియోను వదిలాడు. అయితే, అది పెద్ద వివాదమై కూర్చొంది. రోడ్డుపై ఆ న్యూసెన్స్ ఏమిటని కొందరు, ఆత్మహత్యలను ప్రోత్సాహిస్తున్నావా? అని మరికొందరు విశ్వక్ సేన్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్.. విశ్వక్ సేన్ మీద హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అభిమాని సూసైడ్ పేరుతో ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరినట్లు తెలిసింది. 


దీనిపై ఒక టీవీ ఛానల్ చర్చ పెట్టింది. ఈ విషయం తెలిసి విశ్వక్ సేన్ నేరుగా ఆ చానల్ స్టూడియోలోకి వెళ్లారు. స్టూడియోలో ఉన్న ఆ చానల్ ప్రతినిధితో విశ్వక్ సేన్ వాదనకు దిగాడు. అది కాస్త.. చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో చానల్ ప్రతినిధి విశ్వసేన్‌ను ‘గెట్ అవుట్’ అని అరిచింది. లైవ్‌లో ప్రసారమైన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాదాలంటే చెవి కోసుకొనే రామ్ గోపాల్ వర్మకు సైతం అందింది. 


అయితే, ఆర్జీవీ.. హీరో విశ్వక్ సేన్‌కు కాకుండా ఆ టీవీ చానల్ ప్రతినిధికి సపోర్ట్ చేస్తూ అభిమానులకు ఊహించని ట్వి్స్ట్ ఇచ్చారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘పురుషుడి కంటే చాలా శక్తివంతమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె సర్కార్ కంటే తక్కువ కాదు’’ అని పొగిడేశారు. దీంతో నెటిజనులు ఆర్జీవిని ట్రోల్ చేస్తున్నారు.


Also Read: పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏమిటి? విశ్వక్ సేన్ మీద కంప్లైంట్ చేసిన లాయర్


'అశోక వనంలో అర్జున కళ్యాణం' (Ashoka Vanam Lo Arjuna Kalyanam movie) చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకుడు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'రాజావారు రాణీగారు' చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా కథ అందించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు. మే 6న సినిమా విడుదల కానుంది. 


Also Read: చిరంజీవి సినిమా నుంచి రవితేజను తీసేశారా? లేదంటే తప్పించారా?