ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేయడానికి రెడీగా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత తమ అభిమాన కథానాయకుడి సినిమా ఎప్పుడెప్పుడు తమ ముందుకు వస్తుందా? థియేటర్లలోకి సందడి చేస్తుందా? అని రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు, కాలర్ ఎగరేసే మూమెంట్స్‌కు పునాది, స్టార్టింగ్ పాయింట్ ఇవాళే. 'దేవర' ట్రైలర్ విడుదల అవుతున్నది ఈ రోజే.


కొరటాల శివకు అగ్ని పరీక్ష... అలాగే 'దేవర'కూ!
'దేవర' విషయంలో ఎన్టీఆర్ మీద ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అదరగొట్టారు. 'భయానికి తెలియాలి...' డైలాగులో భాష మీద, ఎమోషన్స్ మీద తనకు ఎంత పట్టు ఉందనేది మరోసారి చూపించారు. కానీ, ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)కు మాత్రం ఈ రోజు తొలి అగ్ని పరీక్ష ఎదురు అవుతుంది. ఎందుకంటే... 'ఆచార్య' డిజాస్టర్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది.


'దేవర'లో హీరో లుక్ బావుంది. అది ఎన్టీఆర్ ఖాతాలోకి వెళుతుంది. పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ప్రశంసలు వచ్చినా, విమర్శలు వచ్చినా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఖాతాలోకి వెళతాయి. పాటల్లో జాన్వీ కపూర్ గ్లామర్ హైలైట్ అయ్యింది. ఆవిడ అందానికి సంబంధించిన విషయం అది. ఇప్పటి వరకు ఈ సినిమా పరంగా కొరటాల శివ ప్రూవ్ చేసుకున్నది లేదు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్స్ గ్లింప్స్ రిలీజ్ చేసినా వాళ్లిద్దరూ హైలైట్ అయ్యారు తప్ప కొరటాల శివ మార్క్ కనిపించిందని గానీ, ఆయన డైరెక్షన్ గురించి కానీ ఎవరూ మాట్లాడలేదు.


'దేవర' కథ గురించి, కథలో హీరో క్యారెక్టర్స్ గురించి, విలన్ రోల్ గురించి అటు ఫిల్మ్ నగర్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో బోల్డంత ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని మరింత పెంచే బాధ్యత ట్రైలర్ మీద ఉంది. ఆ ట్రైలర్ కట్ కొరటాల శివ ఎలా చేయించారు? అనేది సాయంత్రం తెలుస్తుంది. 


నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ చేసి రికార్డు క్రియేట్ చేసిన 'దేవర'కు ఆ జోరు పెంచడంలో ట్రైలర్ హెల్ప్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు.


Also Read'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'



ట్రైలర్ లెంగ్త్ ఎంత? ఎప్పుడు విడుదల చేస్తారు?
'దేవర' ట్రైలర్ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ట్రైలర్ లెంగ్త్ ఆల్మోస్ట్ 3 మినిట్స్. కొరటాల శివ 2 నిమిషాల 50 సెకన్లలో కథ ఎంత రివీల్ చేస్తారు? క్యారెక్టర్స్ గురించి ఎంత చెబుతారు? ఇంకేం చేస్తారు? అనేది చూడాలి. రెండు మూడు రోజులుగా ఎన్టీఆర్ ముంబైలో ఇంటర్వ్యూలు ఇస్తూ... తన స్టైలిష్ అప్పియరెన్స్, లుక్స్ వంటి వాటితో సినిమాకు కావాల్సిన బజ్ తీసుకు వచ్చారు. ఇప్పుడు బాధ్యత అంతా కొరటాల శివ మీద ఉంది. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.


Also Read: తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్!