ప్రతి సినిమా విడుదలకు ముందు లెంగ్త్ గురించి డిస్కషన్ జరగడం కామన్. ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ రన్ టైమ్ ఎక్కువ ఉంటే చూడటం లేదని ఓ విమర్శ ఉంది. ఆ మాటల్లో నిజం లేదని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. మూడు గంటల కంటే ఎక్కువ ఉన్నా విజయాలు వస్తాయని నిరూపించాయి. మరి, 'దేవర' లెంగ్త్ ఎంత? అంటే... 


మూడు గంటలోపే 'దేవర' సినిమా!
Devara Movie Runtime: 'దేవర' సినిమా రన్ టైమ్ ఎంత? ఇది తెలుసుకోవాలని 'అర్జున్ రెడ్డి','కబీర్ సింగ్', 'యానిమల్' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం ఆసక్తి చూపించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, దర్శకుడు కొరటాల శివతో జరిగిన సంభాషణలో ఆయన ఆ విషయం అడిగారు. ఆ సమయంలో హీరో గానీ, దర్శకుడు గానీ కరెక్టుగా చెప్పలేదు. 'యానిమల్' రన్ టైమ్ ఎంత? అని ఎదురు ప్రశ్నించారు. అప్పటికి ఫైనల్ రన్ టైమ్ లాక్ కాలేదు. ఫారిన్ కంట్రీలకు ప్రింట్స్ పంపించేశారు. ఇప్పుడు 'దేవర' లెంగ్త్ ఎంతో బయటకు వచ్చింది.






'దేవర' లెంగ్త్ 2.50.58 గంటలు అని యూనిట్ సభ్యులు స్పష్టం చేశారు. మూడు గంటల కంటే ఓ తొమ్మిది నిమిషాలు తక్కువ అన్నమాట. ప్రజల అవగాహన కోసం వేసే టొబాకో యాడ్స్, అభిమానులు - ప్రేక్షకులకు ఎన్టీఆర్ సేఫ్ డ్రైవ్ మెసేజ్ వంటివి తీస్తే  సినిమా లెంగ్త్ 2.42 గంటలే. ఒక సమయంలో ఈ సినిమా రన్ టైమ్ మూడు గంటల పది నిమిషాలు అని ప్రచారం జరిగింది. కానీ, అందులో నిజం లేదని ఇప్పుడు అర్థం అవుతోంది.






Also Readఎన్టీఆర్ ఎగ్జైట్‌మెంట్‌తో నెక్ట్స్ లెవల్‌కు... మనోళ్లకు అంత టైమ్ ఇస్తే అద్భుతాలే - కొరటాల శివ ఇంటర్వ్యూ



'యానిమల్', 'ఆర్ఆర్ఆర్' కంటే తక్కువ
సందీప్ రెడ్డి వంగా తీసిన సినిమా 'యానిమల్' రన్ టైమ్ 3.21 గంటలు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' రన్ టైమ్  3.07 గంటలు. ఆ రెండు సినిమాలతో పోలిస్తే... 'దేవర' రన్ టైమ్ తక్కువ. సో... ఈ సినిమాకు ఆ విషయంలో ప్రేక్షకుల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. కంటెంట్ మీద మూవీ టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది కనుక బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కన్ఫర్మ్ అని ఊహించవచ్చు. 'దేవర' సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. 


Also Readచిరుతో విబేధాలు లేవు... 'ఆచార్య' తర్వాత మెగా మెసేజ్... పుకార్లకు చెక్ పెట్టిన కొరటాల