రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ'తో బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆ సినిమాలో ఇద్దరూ జంటగా కనిపించలేదు.‌ ప్రభాస్, దీపికను జంటగా చూడాలనుకున్న ప్రేక్షకులు... 'స్పిరిట్' హీరోయిన్ పొడుగు కాళ్ళ సుందరి అని తెలిశాక హ్యాపీగా ఫీలయ్యారు. అయితే, ఇప్పుడు ఆ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు.

సందీప్ రెడ్డి వంగాకు కండిషన్లు పెడితే ఎలా?దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్యారెక్టర్ గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు. క్రియేటివిటీ పరంగా తన కథకు ఎవరైనా అడ్డు‌ వస్తే, తన పనిలో వేలు పెడితే ఊరుకునే రకం కాదు. అటువంటి దర్శకుడికి కండిషన్లు పెడితే ఎలా? ఏకంగా సినిమా నుంచి తీసి పక్కన పెట్టేశారు.

'స్పిరిట్'కు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు అనే సంగతి తెలిసిందే. తన కథ, ఫిలిం మేకింగ్ పట్ల ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆ క్లారిటీకి కండిషన్లు పెట్టారట దీపికా పదుకోన్. సాధారణంగా ఎనిమిది గంటల షూటింగ్ టైంను ఒక కాల్ షీట్ అంటారు. దీపిక మాత్రం తాను ఆరు గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని సందీప్ రెడ్డి వంగాకు చెప్పారట. అంతే కాదు... తనకు సినిమా లాభాలలో వాటా కావాలని మరొక కండిషన్ పెట్టారట. 

ఆరు గంటల కంటే ఎక్కువ షూటింగ్ చేయాల్సి వస్తే ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇవ్వాలని, అలాగే తన స్టాఫ్ ఖర్చులు అన్నీ నిర్మాత భరించడంతో పాటు వాళ్లకు జీతాలు కూడా ఇవ్వాలని దీపికా పదుకోన్ గొంతెమ్మ కోరికలు కోరిందట. 'స్పిరిట్' నిర్మాతలలో సందీప్ రెడ్డి వంగా ఫ్యామిలీకి చెందిన భద్రకాళి పిక్చర్స్ కూడా భాగస్వామి. టి సిరీస్ సంస్థ మరో భాగస్వామి. దీపికా పదుకోన్ కండిషన్లు విన్న తర్వాత సినిమా నుంచి ఆవిడను తొలగించారట.

Also Read: డ్రగ్స్ కోసం సపరేట్ బడ్జెట్, రూమ్స్... మాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? తేనె తుట్టెను కదిపిన మహిళా నిర్మాత దీపిక బదులు మృణాల్ ఠాకూర్ వస్తుందా?దీపికా పదుకోన్‌ను తీసేశారని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు అందరూ సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు... మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను హీరోయిన్‌గా తీసుకోమని!ఇప్పటి వరకు ప్రభాస్, మృణాల్ ఠాకూర్ జంట సినిమా చేయలేదు. 'ఫౌజీ'లో మృణాల్ హీరోయిన్ అవుతుందని అందరూ ఆశించినా... చివరకు ఆ క్యారెక్టర్ ఇమాన్వీకి దక్కింది. మరి, ఇప్పుడు అయినా ప్రభాస్ హీరోయిన్ ఛాన్స్ మృణాల్ ఠాకూర్ అందుకుంటుందో? లేదో? చూడాలి. వెయిట్ అండ్ సి. హీరోగా ప్రభాస్ 25వ చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో మాత్రమే కాకుండా చైనీస్, కొరియన్, జపనీస్ భాషల్లోనూ విడుదల చేయడానికి సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నారు.

Also Readహీరోలను డామినేట్ చేసిన కియారా బికినీ... ట్విట్టర్‌లో ఆ పోస్టులు, ఫాలోయింగ్ చూస్తే మాస్ మెంటల్