Senior Acctress Kajol Fake Video : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ రష్మిక మందన(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియో పై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఎందరో సెలబ్రిటీలు ఈ వీడియో పై అసహనం వ్యక్తం చేశారు. ఆ ఘటన మరువకముందే తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, అజయ్ దేవగన్ భార్య కాజోల్(Kajol) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో కాజోల్ ఓ రూమ్ లో బట్టలు మార్చుకుంటూ కనిపించింది. ఈ అభ్యంతరకర వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో 11 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇది నిజంగా కాజోల్ వీడియోనే అంటూ సోషల్ మీడియా అంతట పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. కానీ ఇది డీప్ ఫేక్ వీడియో అని తాజాగా తేలింది. రీసెంట్ గా రష్మిక ముఖాన్ని ఏ విధంగా అయితే మార్చి వీడియో రిలీజ్ చేశారో అచ్చం అలాగే ఇప్పుడు కాజోల్ ఫేస్ మార్చి కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో దీన్ని వైరల్ చేస్తున్నారు. కాజోల్ ఫేస్ తో మార్ఫింగ్ చేసిన ఈ వీడియో టిక్ టాక్ స్టార్ రోసిబీరీన్స్ గా గుర్తించారు. ఇండియాలో టిక్ టాక్ నిషేధించడంతో VPN టెక్నాలజీ సాయంతో ఆమె టిక్ టాక్ ఖాతాను గుర్తించారు.


జూన్ 5న రోసిబీరీన్స్ సమ్మర్ లో అనుకూలంగా ఉండేలా ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై వీడియో చేసింది. ఇదే వీడియోను ఇప్పుడు ఫేస్ మార్చి కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కాజల్ డీప్ ఫేక్ వీడియో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ తో సహా పలు సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోని ఎవరు మార్ఫింగ్ చేశారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రిటీలు కోరుతున్నారు.


రష్మిక ఫేక్ వీడియో వైరల్ అయిన సందర్భంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం ఈ ఘటనను ఖండించారు. ఆమె ఫ్యాన్స్ తో పాటు అజయ్ దేవగన్ ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా టెక్నాలజీని దుర్వినియోగం కాకుండా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.


మరోవైపు సెలబ్రిటీలకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై భారత ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏ వీడియోకైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే దాన్ని 36 గంటల్లోగా తమ అకౌంట్స్ నుంచి తొలగించాలని, లేకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలు ఏ మాత్రం ఆగడం లేదు.


Also Read : వరల్డ్ కప్ ఎఫెక్ట్, భారీగా తగ్గిన 'టైగర్ 3' కలెక్షన్స్ - మ్యాచ్ రోజు వచ్చింది ఇంతేనా?