Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంతో మంది చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి వారి పాలిట దైవంగా మారారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో మమేకమై చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు. 2020లో మహేష్ బాబు తన భార్య నమ్రత తో కలిసి ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 2500 మందికి పైగా గుండె ఆపరేషన్లు చేయించారు. అంతేకాకుండా తన స్వగ్రామంలో పేద విద్యార్థుల కోసం ఓ పాఠశాలను కూడా నిర్మించారు.


అలా సినిమాల ద్వారా తాను సంపాదించింది పూర్తిగా దాచుకోకుండా పేదవారి కోసం, చిన్నపిల్లల కోసం సేవా కార్యక్రమాల రూపంలో వాటిని ఖర్చు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటూ తోటి హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ ణ(Super Star Krishna) వర్ధంతి సందర్భంగా మహేష్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి నవంబర్ 15న జరిగింది. మహేష్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు.


ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సోషల్ మీడియాలో తండ్రి ఫోటోను షేర్ చేసి, 'ఎప్పటికీ సూపర్ స్టార్' అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే తన తండ్రి వర్ధంతి సందర్భంగా మహేష్ బాబు(Mahesh Babu) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే, 40 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్(Scholarships) ఇవ్వాలని మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ ఎడ్యుకేషనల్ ఫండ్(Super Star Educational Fund) పేరిట 40 మంది పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం ఈ స్కాలర్షిప్ అందజేయాలని మహేష్ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం కాస్త బయటికి రావడంతో మహేష్ మరోసారి శ్రీమంతుడు అనిపించుకున్నారంటూ పలువురు ఆయనపై ప్రశంశలు కురిపిస్తున్నారు.


మరోవైపు అభిమానులు సైతం ఈ విషయం తెలిసి 'మహేష్ అన్నా, నువ్వు చాలా గ్రేట్', 'మహేష్ బాబుని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి' అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం'(Guntur Karam) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన 'దమ్ మసాలా'(Dum Masala) సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.


ప్రస్తుతం యూట్యూబ్లో ఈ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : పాయల్‌కు ఫోన్ చేసి సీరియస్ అయిన దర్శకుడు అజయ్, అసలు విషయం ఏంటంటే?