Dabidi Dibidi Song: గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ టైటిల్‌తోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన మేకర్స్.. ఇప్పుడు ప్రమోషన్స్‌లో వదులుతున్న కంటెంట్‌తో సంక్రాంతికి బాలయ్య ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడనే ఫీల్‌ని ప్రేక్షకులకు ఇచ్చేస్తున్నారు. అందులోనూ బాలయ్య‌కు ఉన్న సంక్రాంతి ట్రాక్ రికార్డ్ మాములుది కాదు. ఆయన భాషలో చెప్పాలంటే ‘దబిడి దిబిడే’. బాలయ్య గురించి ఎదుటి వాళ్లకి ఏదయినా చెప్పాలంటే.. ఎక్కువగా అందరూ ఉపయోగించే పదం ‘దబిడి దిబిడే’. ఇప్పుడిదే పదంతో ఓ పాటనే క్రియేట్ చేశారు ‘డాకు మహారాజ్’ మేకర్స్. గురువారం చిత్రం నుండి మూడవ సాంగ్‌గా ‘దబిడి దిబిడి’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.


వాస్తవానికి ఈ పాట ప్లేస్‌లో ట్రైలర్ రావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్‌ని వాయిదా వేసి.. ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయకూడదని, ఆ స్థానంలో ఈ పాటను విడుదల చేశారు. ఇక ఈ పాట ఎలా ఉందంటే.. నిజంగా ‘దబిడి దిబిడే’ అన్నట్లుగా దుమ్మురేపుతోంది. ఇంకా చెప్పాలంటే.. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతోంది. ఈ పాటలో బాలయ్య సరసన హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నర్తించింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ మాస్ సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే.. బాలయ్య బ్లాక్‌బస్టర్ సినిమాలలోని డైలాగ్స్ అన్నింటిని కలిపి పాటగా చేయడం. గీత రచయిత కాసర్ల శ్యామ్ నిజంగా బాలయ్య డైలాగ్స్‌తో మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు. 


Also Read‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే


ఇక బాలయ్య సినిమా అంటే చాలు.. రెడ్ బుల్ తాగిన వాడిలా రెచ్చిపోయే థమన్.. మరోసారి ప్రాణం పెట్టి మరీ ఈ పాటను కంపోజ్ చేశాడు. బాలయ్య మాస్ స్టెప్స్, ఊర్వశి గ్లామర్, థమన్ సంగీతం, వాగ్దేవి గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఇలా అన్ని కలిసి వచ్చిన ఈ పాట బాలయ్య కెరీర్‌లో మరో చార్ట్‌బస్టర్ సాంగ్‌గా నిలిచిపోతుందని చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ పాట సాహిత్యం గమనిస్తే.. 



‘‘ఉల్లాల ఉల్లాల.. నా మువ్వ గోపాల
కత్తులతోటే కాదు కంటి చూపుతోనే చంపాల..
ఉల్లాల ఉల్లాల.. నా బాల గోపాల
కిస్సుల ఆటకొస్తా.. ప్లేస్, టైమ్ నువ్వే చెప్పాల..
అరె.. ద ద ద దా నారాజా.. తెరిచిపెడతా మెన్షన్ హౌసూ దర్వాజ..
చలో నీదే కాదా హనీ రోజా.. ఒళ్లో పెడతా విప్పావంటే నీ పంజా..
ఇంటీకే వస్తావో.. నట్టింటికే వస్తావో.. నువ్వు అడుగెడితే.. హిస్టరీ రిపీట్సే.. 


హే దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల..
హే దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మొగిపోయేలా..
హే దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్ దంచు దంచు బాల..
హే దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిచిపోయేలా..’’ అంటూ సాగిన ఈ పాట.. ఇంతకు ముందు ‘యా యా యాయా జై బాలయ్య’ను గుర్తు చేస్తుండటం విశేషం. మొత్తంగా చూస్తే మాత్రం బాలయ్య ఫ్యాన్స్‌కి మాంచి మసాలా ట్రీట్ అనేలా ఈ పాట ఉంది. ఒక్క బాలయ్య అభిమానులనే కాదు.. అన్ని వయసుల వారు వింటూనే కాలు కదిపేలా థమన్ ఈ పాటతో మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి స్పెషల్‌గా 2025, జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బారీ స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.


Also Read: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?